లైగర్‌లో పోకిరి సీన్ రిపీట్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైగర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

కాగా ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్నట్లు చిత్ర పోస్టర్స్ చూస్తే మనకు అర్థం అవుతోంది.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్‌గా మనల్ని ఎంటర్‌టైన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

అయితే ఈ సినిమాలో పోకిరి తరహా ఎలిమెంట్ ఒకటి ఉంటుందని, అది ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రంలో ప్రీ-క్లైమాక్స్ సస్పెన్స్ రివీల్ ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించిందో అందరికీ తెలిసిందే.

ఆ ఒక్క సీన్‌తో పోకిరి సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు.

ఇప్పుడు లైగర్ చిత్రంలో కూడా అచ్చం ఇలాంటి సస్పెన్స్ సీక్వెన్స్ ఒకటి ఉందని తెలుస్తోంది.

ఈ సినిమాలోని ప్రీక్లైమాక్స్‌లో వచ్చే ఈ సీన్ లైగర్ చిత్రానికి ప్రాణంగా ఉండబోతుందట.

ఏదేమైనా పోకిరి లాంటి సస్పెన్స్ ఉంటే మాత్రం లైగర్ చిత్రం కూడా అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని పూరీ ఫ్యాన్స్ అంటున్నారు.

మరి ఈ సినిమాలో ఉండబోయే ఆ సస్పెన్స్ ఏమిటనేది తెలియాలంటే మాత్రం లైగర్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను మెప్పించనుండగా, బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మీతో కలిసి పూరీ జగన్నాథ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాను బాలీవుడ్‌లో కరణ్ జోహర్ రిలీజ్ చేస్తుండటంతో అక్కడ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.