ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ల జాబితాలో లైగర్ మూవీ ముందువరసలో ఉండే అవకాశం అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమాకు ఏకంగా 60 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో లైగర్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయనే సంగతి తెలిసిందే.
ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం పలువురు థియేటర్ల ఓనర్లు లైగర్ సినిమాకు ఆఫర్లను కూడా ప్రకటిస్తుండటం గమనార్హం.
లైగర్ సినిమాను ప్రదర్శిస్తున్న ఒక థియేటర్ యాజమాన్యం మూడు టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ అంటూ ఆఫర్ ప్రకటించింది.అయితే స్టార్ హీరో విజయ్ దేవరకొండ సినిమాకు ఇలాంటి ఆఫర్ ను ప్రకటించినా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం గమనార్హం.
లైగర్ ఫ్లాపైందని చిత్ర బృందం కూడా ఫిక్స్ అయింది.
ఆ కారణం వల్లే ఈ సినిమాకు సక్సెస్ మీట్ నిర్వహించడానికి కూడా చిత్రయూనిట్ పెద్దగా ఆసక్తి చూపలేదు.
పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా లైగర్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.ఈ మధ్య కాలంలో ఏ సినిమా డిజాస్టర్ కాని స్థాయిలో ఈ సినిమా డిజాస్టర్ అయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా నష్టాల భారం ఎవరిపై పడుతుందో చూడాల్సి ఉంది.విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ను వదులుకుంటే మాత్రమే ఈ సినిమా నష్టాల భారం నిర్మాతలకు తప్పే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.అటు పూరీ జగన్నాథ్ ఇటు ఛార్మీలకు ఆర్థికంగా ఈ సినిమా భారీస్థాయిలో నష్టాలను మిగల్చడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఖుషి సినిమాతో విజయ్ దేవరకొండ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు భావిస్తున్నారు.








