గుంటూరులో తమ మొట్టమొదటి స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా టియర్‌–2 మార్కెట్‌లకు తమ విస్తరణను వెల్లడించిన లైఫ్‌స్టైల్‌

గుంటూరు, 20 మే 2022 : ఫ్యాషన్‌కు ఓ నూతన కేంద్రం ఉంది.భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే స్టోర్‌గా లైఫ్‌స్టైల్‌, తమ కార్యకలాపాలను టియర్‌ 2 మార్కెట్‌లకు సైతం విస్తరిస్తూ తమ నూతన స్టోర్‌ను గుంటూరులో ఎన్‌టీఆర్‌ స్టేడియం పక్కన, లక్ష్మీపురం రోడ్డు వద్ద మే 20వ తేదీన ప్రారంభించింది.

 Lifestyle Announces Its Expansion Into Tier-2 Markets With The Launch Of Its Fir-TeluguStop.com

దాదాపు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక స్టోర్‌, వినియోగదారులను అత్యుత్తమ ఫ్యాషన్‌లను అందుబాటు ధరలలో పొందాల్సిందిగా ఆహ్వానిస్తూనే, ఆహ్లాదకరమైన షాపింగ్‌ అనుభూతులను అందిస్తామనే వాగ్ధానం చేస్తుంది.ఈ స్టోర్‌ ప్రారంభోత్సవంలో గుంటూరు నుంచి పలువురు వీఐపీలు పాల్గొన్నారు.

ఉత్సాహపూరితమైన, విలువైన షాపర్లు నుంచి అపూర్వమైన స్పందనను ఈ స్టోర్‌ అందుకుంది.బ్రాండ్‌ పట్ల తమ ప్రేమను వ్యక్తీకరించిన వీరంతా కూడా స్టోర్‌ ప్రారంభోత్సవానికి ఆసక్తిగా ఎదురుచూశారు.

అత్యధిక శాతం వినియోగదారులు స్టోర్‌ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫోటోబూత్‌ వద్ద చిత్రాలు తీసుకోవడానికి ఆసక్తి చూపారు.ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన ఈ ఫోటోబూత్‌లో ఫోటో దిగిన వారికి తక్షణమే ఫోటోను ఫోటోఫ్రేమ్‌లో అందించారు.

ఈ ప్రతిష్టాత్మక స్టోర్‌ను అత్యంత ఆకర్షణీయంగా, ఆధునిక వినియోగదారుల మనసును గుర్తెరిగి తీర్చిదిద్దారు.ఇది ఆసక్తిగా, ఆకర్షణీయంగా, ప్రకాశవంతంగా ఉండాలనే లైఫ్‌స్టైల్‌ స్ఫూర్తిని వెల్లడిస్తుంది.విస్తృతశ్రేణిలో జాతీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్ల ఎంపికతో ఇది తమ వినియోగదారులకు మహోన్నత ధోరణులతో కూడిన కలెక్షన్‌ను, అత్యున్నత శ్రేణి స్టోర్‌ ఫిక్చర్స్‌తో అందిస్తుంది.ఈ స్టోర్‌ వద్ద, విస్తృత శ్రేణి ఫ్యాషన్‌ బ్రాండ్లు అయినటువంటి లైఫ్‌స్టైల్‌ యొక్క ఫ్యాషనబల్‌ ఫోర్ట్‌ఫోలియో బ్రాండ్లు అయినటువంటి మెలాంజ్‌, కప్పా, కోడ్‌, ఫోర్కా, జింజర్‌, బొస్సినీ, ఫేమ్‌ ఫరెవర్‌ మరియు మరెన్నో అందుబాటులో ఉన్నాయి.

అదనంగా, పూర్తి సరికొత్త వేసవి కలెక్షన్‌ అత్యంత ఆకర్షణీయంగా ఉంది.చక్కటి ఫ్యాషన్‌ సౌందర్యం మరియు ప్రకాశవంతమైన రంగుల సమ్మేళనంగా అత్యంత అందుబాటు ధరలలో లభిస్తూ గుంటూరులోని ఫ్యాషన్‌ అభిమానులను ఆకట్టుకోనుంది.

స్టైల్‌పై నమ్మకంతో తమ షాపర్స్‌కు ఆనందానుభూతులను అందించాలనే బ్రాండ్‌ ఉద్దేశ్యానికి అనుగుణంగా, ఈ స్టోర్‌లోని కలెక్షన్‌ను గుంటూరులోని షాపర్స్‌ వినూత్నమైన వ్యక్తిత్వం, శైలి అవసరాలకు తగినట్లుగా కూర్యేట్‌ చేయబడింది.ఈ స్టోర్‌లో విస్తృతశ్రేణిలో ఎంపికలు పురుషులకు 499 రూపాయల ప్రారంభ ధరతో ఉన్నాయి.

వీటిలో వైబ్రంట్‌ పోలోలు, టీ షర్టులు కూడా ఉంటాయి.కుర్తాలు 799 రూపాయలు, డెనిమ్స్‌ 999 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తాయి.

మహిళల కలెక్షన్‌లో విస్తృత శ్రేణిలో టాప్స్‌ 299 రూపాయల నుంచి డెనిమ్స్‌ 699 రూపాయల నుంచి లభిస్తాయి.కలర్‌ఫుల్‌ కుర్తాలు కోరుకునేటటువంటి 499 రూపాయల ధరలో లభిస్తాయి.

ఆహ్లాదకరమైన కిడ్స్‌వేర్‌ కలెక్షన్‌ కేవలం 249 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తే ట్రెండీ ఫుట్‌వేర్‌ కేవలం 499 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తుంది.లైఫ్‌స్టైల్‌ ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన రాయితీని 30% తగ్గింపుతో గుంటూరు షాపర్లకు అందిస్తుంది.

ఈ ఆఫర్‌ కేవలం మూడు రోజుల పాటు అంటే మే 20 నుంచి మే 22, 2022 వరకూ లభిస్తుంది.

ఈ సందర్భంగా లైఫ్‌స్టైల్‌ సీఈవో శ్రీ దేవరాజన్‌ అయ్యర్‌ మాట్లాడుతూ ‘‘టియర్‌ 2 మార్కెట్‌లో సైతం మా కార్యకలాపాలను విస్తరించాలనే లక్ష్యానికనుగుణంగా గుంటూరులో ప్రారంభించిన స్టోర్‌ మొట్టమొదటిది.

మా లక్ష్య సాధన దిశగా తొలి అడుగుగా నిలుస్తుంది.గుంటూరులో మాకు అపార అవకాశాలున్నాయని భావిస్తున్నాము మరియు తాజా ఫ్యాషన్‌ల పట్ల వీరికి మెరుగైన అవగాహన ఉంది.

ఈ నూతన స్టోర్‌లో వినియోగదారులకు అనుకూలమైన లేఔట్‌లో, అత్యుత్తమ బ్రాండ్ల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన స్టైల్స్‌, డిజిటల్‌గా సమృద్ధి చేయబడిన వాతావరణం వంటివి వినియోగదారులకు అంతర్జాతీయ షాపింగ్‌ అనుభవాలను అందించనున్నాయి’’ అని అన్నారు.

లైఫ్‌స్టైల్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో lifestylestores.com ద్వారా లభ్యమవుతుంది.

ఇక్కడ వినియోగదారులు తమ ఇంటి నుంచి అత్యంత సౌకర్యవంతంగా కొనుగోళ్లు చేయవచ్చు.క్లిక్‌ అండ్‌ కలెక్ట్‌ మరియు రిటర్న్‌ టు స్టోర్‌ వంటి ఫీచర్ల ద్వారా లైఫ్‌స్టైల్‌ అసలైన ఓమ్నీ ఛానెల్‌ అనుభవాలను తమ వినియోగదారులకు అందిస్తుంది.

అత్యుత్తమ సేవలు పరిచయం చేయడంతో పాటుగా తమ వినియోగదారులకు సరళీకృత, వేగవంతమైన షాపింగ్‌ అనుభవాలను అందించేందుకు లైఫ్‌స్టైల్‌ యాప్‌ ఇప్పుడు ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube