వాళ్ల వద్దే తేల్చుకుందాం ! టి. బీజేపీ అసంతృప్తుల డిసైడ్ ?

తెలంగాణ బిజెపి( Telangana bjp )లో పరిస్థితులు రోజురోజుకు గందరగోళంగా మారుతున్నాయి.ఆ పార్టీలోని అసంతృప్త నాయకులంతా తాడోపేడో  తేల్చుకునేందుకు అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టేందుకు నిర్ణయించుకున్నారు.

 Let's Decide With Them! T Bjp Unhappy Decide , Telangana Bjp, Telangana El-TeluguStop.com

కేసీఆర్( CM kcr ) ను  అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలు బీజేపీ లో చేరారు.అయితే బిజెపి ముందుకు వెళుతున్న తీరు , ఆ పార్టీలోని సీనియర్ నాయకులు నుంచి తమకు ఎదురవుతున్న ఇబ్బందులు, తదితర అంశాలపై చాలాకాలంగా వీరంతా అసంతృప్తితోనే ఉన్నారు.

ఇప్పటి వరకు రహస్య సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్ కార్యాచరణ , పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించుకున్న అసంతృప్తినేతలు,  ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కేంద్ర బిజెపి పెద్దలైన నరేంద్ర మోది, అమిత్ షా( Amith sha ) వద్దే ఈ వ్యవహారాలను తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట.

Telugu Amith Sha, Brs, Modhi, Telangana Bjp, Telangana-Politics

తమ అసంతృప్తికి గల కారణాలు ఏమిటనేది వారి వద్ద తేల్చుకోవాలి అని నిర్ణయించుకున్నారట.పార్టీలో తమకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వారి వద్దే చర్చించాలని నిర్ణయించుకున్నారు.తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో బిజెపి రాష్ట్ర నాయకత్వం బిజీగా ఉంటుంది .ఈ సమయంలోనే అసంతృప్త నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తూ పార్టీకి తలనొప్పిగా మారారు.

Telugu Amith Sha, Brs, Modhi, Telangana Bjp, Telangana-Politics

అంతేకాదు ఢిల్లీకి వెళ్లి మరి అసంతృప్తికి గల కారణాలను వివరించేందుకు నిర్ణయించుకోవడం,  అక్టోబర్ 1 లేదా మూడో తేదీల్లో ప్రధాని మోదీ( Narendra Modi ) తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలో ఆయనతోనే సమావేశం అయ్యేందుకు  ప్రయత్నాలు చేస్తున్నారట.  అలా కానిపక్షంలో ఢిల్లీకే వెళ్లి పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.పార్టీలో ముందు నుంచి ఉంటున్న వారిని పక్కన పెట్టి కొత్తగా చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై చాలామంది బిజెపి సీనియర్ నేతలు అసంతృప్తి తో ఉన్నారట.

ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఈ తరహా పరిణామాలు మా పార్టీ నేతలలో ఆందోళన కలిగిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube