టాలీవుడ్ హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం స్కంద( Skanda ).ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.అలాగే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే.
త్వరలోనే ఏపీ తెలంగాణలో ఎన్నికలలో సందర్భంగా దర్శకనిర్మాతలు వాటిని లక్ష్యంగా చేసుకొని పూర్తిస్థాయి రాజకీయ సినిమాలే నిర్మిస్తున్నారు.

అంతేకాకుండా సినిమాలలో రాజకీయాలకు సంబంధించిన పంచులు డైలాగులు( Political Punch Dialogues ) కూడా రాస్తున్నారు.ఇటీవలే బాలకృష్ణ నటించిన చిత్రం వీరసింహారెడ్డి మూవీలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెట్టిన కొన్ని డైలాగులు ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే.ఈ సినిమాకు హైప్ రావడానికి ఆ డైలాగులు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.
ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను( Director Boyapati Srinu ) కూడా తన సినిమాలలో పరోక్షంగా జగన్ సర్కారునీ ఉద్దేశించి కొన్ని డైలాగులు రాసినట్టు తెలుస్తోంది.లెజెండ్, అఖండ సినిమాల్లోనూ బోయపాటి రాయించిన కొన్ని డైలాగులు జగన్ అండ్ కో కు పరోక్షంగా తగిలాయి.
అయితే ఇప్పుడు బోయపాటి దర్శకత్వం వహించిన స్కంద సినిమాలో పొలిటికల్ డైలాగులు ఉన్నట్లు తెలుస్తోంది.

బోయపాటి తెలుగు దేశం పార్టీ మద్దతుదారు( TDP ) అన్న విషయం తెలిసిందే.అలాగే హీరో రామ్ బంధుగణంలోనూ కొంతమంది టీడీపీలో ఉన్నారు.రామ్ మావయ్య అయిన రమేష్ హాస్పిటల్ అధినేత రామ్‌ను గతంలో జగన్ సర్కారు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వాన్ని( AP Government ) బోయపాటి టార్గెట్ చేస్తూ ఈ సినిమాలో కొన్ని పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగులు పెట్టాడని సమాచారం.ఇందులో ఒక పాత్ర కూడా ఒక నాయకుడిని గుర్తు తెచ్చేలా ఉంటుందట.
ఈ పాత్ర సినిమాలోని కొన్ని డైలాగులు కచ్చితంగా రాజకీయంగా ఒక చర్చకు తెర తీస్తాయని అంటున్నారు.మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.







