ఘర్షణ నివారిద్దాం..! బైడెన్, జిన్ పింగ్ గంటన్నర సేపు ఫోన్ లో మాటామంతి

 గత ఏడు మాసాల్లో మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గురువారం ఫోన్ లో ముఖాముఖి చర్చలు జరిపారు.ఘర్షణలకు దూరంగా ఉండే పంథాను అనుసరించాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు.90 నిమిషాల పాటు వీరు ఫోన్ లో మాట్లాడుకున్నారు.ఇరు దేశాల మధ్య ఘర్షణలకు దారి తీసే అపార్ధల గురించి బైడెన్ హెచ్చరించారని వైట్ హౌస్ తెలిపింది.

 Let's Avoid Conflict ..! Biden And Jinping Talk On The Phone For An Hour And A H-TeluguStop.com

తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకున్న ఇరు దేశాల సంబంధాలకు కొత్త దిశా  నిర్దేశం కోసం జిన్ పింగ్ పిలిపించారు.ట్రంప్ హయాంలో అమెరికా-చైనా మధ్య సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

చైనా పై వాణిజ్య యుద్ధం ఆరంభించారు కరోనా కల్లోలానికి కారణమంటూ చైనాను వేధించారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బహుళవాదానికి పిలుపునిచ్చారు.

ట్రంప్ చేపట్టిన అమెరికా ఫస్ట్ సిద్ధాంతాలకు స్వస్తి చెప్పాలని కోరారు.అయితే వాణిజ్య సుంకాలను కొనసాగిస్తూ సైబర్ భద్రతా, మానవహక్కుల వంటి అంశాలపై చైనాతో కఠినంగానే వ్యవహరిస్తున్నారు.

అనుకోని సంఘటన తలెత్తే పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా ఉండేలా చూడాలని అమెరికా కోరుకుంటుందని బైడెన్ స్పష్టం చేశారని అమెరికా ప్రభుత్వ అధికారి విలేకరులకు తెలిపారు.

బైడెన్ తో  జరిగిన ఫోన్ సంభాషణ నిజాయితీగా, కూలంకుషంగా జరిగిందని బీజింగ్ ప్రభుత్వం సీసీటీవీ వ్యాఖ్యానించింది.

చైనా పట్ల అమెరికా ఇటీవలే అనుసరిస్తున్న విధానం కారణంగా తలెత్తిన ఇబ్బందుల గురించి జిన్ పింగ్ మాట్లాడారు. వాణిజ్యం, సాంకేతికత, మానవ హక్కులు, కరోనా మూలాలు ఇలా ఘర్షణ పడిన అంశాలను ప్రస్తావించారని తెలిపింది.

Telugu Ciber Secutity, Corona, Biden-National News

ఇరు దేశాలు తమ సంబంధాలను సక్రమంగా నిర్వహించుకోవడం భవిష్యత్తు కు కీలకమని, అలాగే ప్రపంచ దేశాలు కూడా ముఖ్యమని జిన్ పింగ్ ను ఉటంకిస్తూ సీసీటీవీ పేర్కొంది.ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య ప్రతిష్టంభన చాలా ప్రమాదకరమని దీని పరిష్కారం కోసం ఇరువురు నేతలు జోక్యం అవసరం అని వైట్ హౌస్ వ్యాఖ్యానించింది.  దేశాల మధ్య సంబంధాలను బాధ్యతాయుతంగా నిర్వహించడమే ఈ ఫోన్ కాల్ ముఖ్యమని పేర్కొన్నారు.చైనాతో కింది స్థాయిలో జరిగిన యత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని అన్నారు.

ఇరువురు నేతలు తమ ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube