విద్యా రంగా పరిరక్షణ కోసం, విద్యారంగ సమస్యలపరిష్కారం కోసం , శాస్త్రీ విద్యాసాధన కోసం, లంపెన్ గ్యాంగుల పై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లో ప్రగతిశీల ఉద్యమాల వెల్లువ సృష్టించిన కామ్రేడ్ జార్జ్ రెడ్డి నేటి విద్యార్థులకు, యువతకు స్ఫూర్తి కావాలని పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎన్ ఆజాద్, ఎన్ వి రాకేష్ పిలుపునిచ్చారు ఖమ్మం నగరంలోని గిరిజన బాలుర వసతి గృహంలో పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జార్జిరెడ్డి 50 వ వర్ధంతి సభ ను నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన మెకాలే విద్యా విధానం స్థానంలో శాస్త్రీయ విద్యా విధానం స్థాపించాలని దోపిడీ పీడన అంటరానితనం ఆర్థిక అసమానతలు లేని సమాజం రావాలని మహోన్నత వ్యక్తి కామ్రేడ్ జార్జి రెడ్డి అని గుర్తు చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో 1970 దశకంలో న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్మెడల్ సాధించి వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకుడుగా నిలిచాడు అని వారు గుర్తు చేశారు.
ఇవిటీజింగ్, ర్యాగింగ్ లకు మత ఛాందసవాద భావజాలానికి వ్యతిరేకంగా విద్యార్థులను కూడగట్టి , జీనా హైతో మర్ నా సీఖో, కదం కదం ఫర్ లడ్ నా సికో అనే నినాదాన్ని ఇచ్చి , ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి లోకాన్ని వెన్ను తట్టి లేపి దేశంలోని విద్యార్థుల మెదళ్లలో ప్రగతిశీల భావాలు వెదజల్లడని వారు కొనియాడారు.కామ్రేడ్ జార్జి రెడ్డి బ్రతికుంటే ఇండియన్ చే గువేరా అయ్యేవాడని, అకాడమిక్ కొనసాగితే ఇండియన్ ఐన్స్టీన్ అంతటి గొప్పవాడిగా వెలుగొందే వాడని వారు తెలిపారు.
నేటి తరం విద్యార్థులు యువకులు కుల మత తత్వాల ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా లౌకిక ప్రగతిశీల భావజాలం కలిగి ఉండాలని వారు పిలుపునిచ్చారు.శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్నవారు జార్జిరెడ్డి నిజమైన వారసులు ఉన్నారు విప్లవ విద్యార్థి ఉద్యమ చరిత్రలో కామ్రేడ్ జార్జి రెడ్డి మర్చిపోలేని జ్ఞాపకం అన్నారు.
జార్జిరెడ్డి స్పూర్తితో నేటి విద్యార్థులు పాలకవర్గాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై పిడిఎస్యు ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉదృతం చేస్తూ, ప్రగతిశీల శక్తుల ఐక్యతతో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా కార్యదర్శి వి.వెంకటేష్, పీ వై ఎల్ నగర అధ్యక్షులు చందు పి డి ఎస్ యు జిల్లా నాయకులు లక్ష్మణ్, శ్రీకాంత్, పీ వైఎల్ నాయకులు శివ, రవితేజ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.