వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్కు( Congress ) తగిన గుణపాఠం చెప్పి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోసారి నిలబెట్టాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు ఆపదర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.పాలకుర్తి నియోజక వర్గం తొర్రూర్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన ఆయన 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ ప్రజలకుగాని దేశ ప్రజలకు గాని ఒరిగిందేమీ లేదని, గత పది సంవత్సరాలలో పాలకుర్తి నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీలతో పోల్చి ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు .
ఎన్నికలు అనగానే అనేక పార్టీలు వచ్చి ఏవేవో హామీలు ఇస్తారని, తిమ్మిని బమ్మి చేసే ప్రకటనలు ఇస్తారని కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న ఏకైక హక్కు గా ఉన్న ఓటు ని సరిగా ఉపయోగించుకుండా అడ్డదిడ్డంగా ఆలోచించి ఆగం చేసుకుంటే ఐదు సంవత్సరాలు ఇక్కట్ల పాలవుతామని కేసీఆర్( CM KCR ) హెచ్చరించారు.

ఒకప్పుడు ఈ ప్రాంతాల నుంచి వేలాది మంది ఇతర ప్రాంతాలకు బ్రతుకుదెరువు కోసం వలస వెళ్లేవారని ఇప్పుడు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వస్తున్నారని, పాలకుర్తి నియోజకవర్గం లో లక్షా 30 వేల ఎకరాలకు నీరందించిన ఘనత బారతీయ రాష్ట్ర సమితి( BRS party ) దే నాని ఆయన చెప్పుకొచ్చారు.అభివృద్ధిలో రాష్ట్రం ముందుకి వెళ్ళాలి తప్ప వెనుకకు వెళ్ళకూడదు అని, కాంగ్రెసు గెలిస్తే మళ్ళీ కరెంట్ కష్టాలు మొదలవుతాయని చెప్పుకొచ్చారు .

కాంగ్రెస్ గెలిస్తే జానారెడ్డి ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటున్నారని, ఇంతకుముందు ఒకసారి ఆయనకు మీరు ఓటుతో బుద్ధి చెప్పారని, మరోసారి వారికి తగిన గుణపాఠం చెప్పి తమ అభ్యర్థి భగత్( Nomula Bhagath ) ను 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ప్రజాస్వామ్యం పూర్తిస్థాయిలో పరిణితి చెందలేదని, ఓటు వేసే ముందు ప్రజలు ఒకటికి పది సార్లు ఆలోచించాలని ఎవరి చేతుల్లో పెడితే రాష్ట్రం పచ్చగా ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, పదిమందికి మంచి జరిగే నిర్ణయం తీసుకోవాలని ఆయన వాఖ్యానించారు .సామాజిక బాధ్యతలో భాగంగానే పెన్షన్లు పెంచామని, తాము మరోసారి అధికారంలోకి రాగానే పెన్షన్ 5000 చేస్తామని హామీ ఇచ్చారు .