ఎమ్ఎస్ సుబ్బలక్ష్మి గురించి భారత దేశ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ పేరు వింటే చాలు ప్రతి ఒక్కరు గాయని అని ఇట్టే గుర్తుపట్టేస్తారు.
ఒక విధంగా చెప్పాలంటే పరిచయం అక్కర్లేని పేరు.కర్ణాటక సంగీత విద్యాంసురాలు, గాయని, నటిగా మన అందరికి తెలుసు.
ఈవిడ అత్యంత గౌరవ ప్రదమైన భారతరత్న పురస్కారాన్ని కూడా అందుకున్న మొట్ట మొదటి సంగీత కళాకారిణి.సంగీతానికి మరొక రూపం ఈవిడ.
మనం నిత్యం పూజించే శ్రీవారి సుప్రభాతాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఎమ్ఎస్ సుబ్బలక్ష్మీ గారికే సొంతం.అంతేకాదండోయ్.
నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన సరోజినీ నాయుడు గారు ఒకానొక సందర్భంలో గాయని సుబ్బలక్ష్మి గారిని ఉద్దేశించి ఇలా కూడా అన్నారు.అసలు “గాన కోకిల అంటే నేను కాదు సుబ్బలక్ష్మి గారు అసలైన నైటింగేల్ ఆఫ్ ఇండియా ” అంటూ ఆమెను ప్రసంశించారు.
ఎమ్ఎస్ సుబ్బలక్ష్మి గారు దాదాపు 10 భాషల్లో పాటలు పాడి విశేష ఆదరణ సంపాదించారు.ఆవిడ కట్టు బొట్టు చూస్తే ఎవరయినా సరే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టే అంత సాంప్రదాయ బద్దంగా ఉంటారు.
సాంప్రాదయ పద్దతిలో చక్కగా పట్టుచీర కట్టుకుని, నుదుటి మీద సిందూరం పెట్టుకుని, కళ్ళకు కాటుక దిద్ది, చేతి నిండా గలగలా మానేలా గాజులు వేసుకుని, వెనుక కొప్పు పెట్టుకుని కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని ఆవిడ సంగీతంను ఆలపిస్తుంటే చూడడానికి రెండు కళ్ళు, వినడానికి రెండు చెవులు చాలవు అనేలా ఉండేవారు.అలాంటి సుబ్బలక్ష్మి గారు లక్ష చుక్కల్లో ఒకరిగా మెరిసిపోయారు.
తమిళనాడులోని వేలూరు మ్యూజియంలో ఈ చిత్రం చోటు చేసుకుంది.

లక్ష చుక్కలతో గీసిన ఎమ్ఎస్ సుబ్బలక్ష్మి గారి చిత్రం వేలూరు మ్యూజియంలో బుధవారం రోజున ఏర్పాటు చేయగా ఆ చిత్రం చూసి ప్రజలు తెగ సంబరపడిపోతున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం చుపురులను బాగా ఆకట్టుకుంటోంది.ఈ చిత్రాన్ని చూస్తుంటే ఆమె నిండైన రూపం మళ్ళీ మన కళ్ళల్లో మెదులుతుంది అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.
ఈ చిత్రంపై మ్యూజియం పర్యవేక్షకులు అయిన శరవణన్ మాట్లాడుతూ.వేలూరు సత్తువాచేరికి చెందిన కళాశాల విద్యార్థిని అయినా రాజేశ్వరి పేనా లక్ష చుక్కలు పెట్టి మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి చిత్రం గీసారని తెలిపారు.
ఈ చిత్రాన్ని ప్రదర్శన నిమిత్తం ఆగస్టు 31వ తేదీ వరకు ప్రజల సందర్శన కోసం మ్యూజియంలో వుంచుతున్నామని ఆయన తెలిపారు.సుబ్బలక్ష్మి గారు భౌతికంగా మన దగ్గర లేకపోయిన ఆమె పాటల రూపంలో ఎప్పటికి మన మదిలో మెదులుతూనే ఉంటారు.