Arul Saravanan : గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ది లెజెండ్ హీరో.. బాబోయ్ ఒక్కసారిగా ఇంత మార్పు ఏంటీ?

అరుల్ శరవణన్(Arul Saravanan).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేర్లలో హీరో అరుల్ శరవణన్ పేరు కూడా ఒకటి.

51 ఏళ్ల వయసులో హీరోగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను పలకరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

కాగా అరుల్ శరవణన్ హీరోగా నటించిన ది లెజెండ్(The legend) సినిమా జూలై 28వ తేదీన విడుదలై ప్రేక్షకుల విడుదల అయిన విషయం తెలిసిందే.ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అరుల్ శరవణన్ చేసింది నటించినది చిత్రమే.అతనికి సినీమాలు అంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే.అందుకే అయిదు పదుల వయసులో సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

మొదటి సినిమాతోనే భారీగా గుర్తింపును పరుచుకున్నాడు.అయితే అరుల్ శరవణన్ మొదటి సినిమాపై ఎంతమంది ఎన్ని విధాలుగా విమర్శలు చేసినప్పటికీ మీమ్స్ ట్రోలింగ్స్ చేసినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా సినిమాపై తనకున్న మమకారాన్ని చాటుతూ వచ్చాడు.

ఇది ఇలా ఉంటే త్వరలోనే మరో కొత్త సినిమాని అనౌన్స్ చేయబోతున్నాడు.అయితే తన సెకండ్ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు.

ప్రస్తుతం ఆ నయా లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ లేటెస్ట్ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈయన ది లెజెండ్ హీరోనేనా అని అనుమానం రాకమానదు.కొత్త చిత్రం కోసమే ఇలా లుక్ మార్చినట్లు త్వరలోనే అన్ని విషయాలను తెలియజేస్తానని లెజెండ్ శరవణన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.

ఆ ఫోటోని తదేకంగా అలాగే చూస్తే తప్ప అక్కడ ఉన్నది అరుల్ శరవణన్ అర్థం కాదు.ఇది ఇలా ఉంటే ఇటీవలే అరుల్ శరవణన్ హీరోగా నటించిన ది లెజెండ్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అయ్యి మొదటి రోజే భారీగా వ్యూస్ సాధించిన విషయం తెలిసిందే.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?
Advertisement

తాజా వార్తలు