ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.ఈ షో ప్రారంభమై దాదాపు 60 రోజులు కావస్తోంది.
ఇక ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు మాత్రం ఎక్కడ కూడా తగ్గేలా లేరు.షో ప్రారంభమైన మొదటి వారంలోనే పరిచయాలు కూడా పూర్తి కాకముందుకే గొడవలు పెట్టుకుంటూ శత్రువులుగా మారారు.
నామినేషన్ రౌండ్ లో అసలు రూపాలు బయటపెట్టారు.ఇక ఇందులో అప్పుడప్పుడు రొమాన్స్ లు కూడా బాగా హైలెట్ గా మారుతున్నాయి.
ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో ఏకంగా ముద్దులు అడుక్కుంటూ దారుణంగా ప్రవర్తించారు కంటెస్టెంట్ లు.అందులో జెస్సీ, పింకీ, సిరి లు ఉండగా.ఇరువురి భామల మధ్య లో జెస్సీ రొమాంటిక్ మూడ్ లోకి దిగిపోయాడు.అప్పటికే జెస్సీ కి మెడ పట్టుకొని ఉన్న కూడా అతడికి కొన్ని రొమాంటిక్ కోరికలు బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది.
జెస్సీ పక్కన సిరి కూడా బెడ్ పై పడుకొని ఉండగా అదే సమయంలో వారి దగ్గరికి పింకీ వచ్చింది.

ఇక వెంటనే జెస్సీ పింకీ ని పిలిచి అటు ఒకరు.ఇటు ఒకరు అంటూ రొమాంటిక్ ఫీల్ లోకి దిగాడు.వెంటనే పింకీ.నువ్వు రొమాంటిక్ పర్సన్ అని కామెంట్ చేసింది.సిరి, పింకీ పక్కపక్కనే కూర్చునే సరికి ఆహా.ఇదే నాకు బెస్ట్ టైం.అంటూ నా బుగ్గలు ఖాళీగా ఉన్నాయి ఇద్దరు ముద్దులు పెట్టొచ్చు కదా అంటే ఓపెన్ గా అడిగేసాడు.ఇక సిరి వెంటనే సెటైర్ వేయగా పింకీ మాత్రం అతని గడ్డం పట్టుకొని నిమురుతూ సరసాలాడింది.ఇక ఈ సీన్ చూసిన వాళ్లంతా కెమెరాలు ఉన్నా కూడా ముద్దులు అడుక్కుంటూ దారుణంగా ప్రవర్తిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.