ఉత్తరాది ఎన్నికల తరువాత ఒక్క శాతం ఓట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది.దీనికి తోడు ప్రజల్లోనూ ఉన్న ఇమేజ్ మసకబారిపోయింది.
ఇక కాంగ్రెస్‌లో అంతర్గత పోరుతో చులకనగా మారిపోయింది.ఆ పార్టీ నేతలు ఎవరికి వారే సర్ధుకుపోయిన పరిస్థితి.
ఇక రాజకీయాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.ఒకవిధంగా చెప్పాలంటే కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చిందనే చెప్పొచ్చు.
ఇలాంటి తరుణంలో నవ్విపోదురుగాక….నాకేమీ అన్నట్టు కాంగ్రెస్ నేతలు వ్యవహరించడం చర్చకు తావిస్తోంది.
గతంలో ఏ ఎన్నికలు వచ్చిన గట్టి పోటీ ఇచ్చేది.నేడు ఆ పరిస్థతి లేదు.ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బిగ్ ఆఫర్ ప్రకటించడం గమనార్హం.బీజేపీ వీడీ.
కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయ్.మనం చేతులు కలుపుదాం.
అంటూ పిలుపు కూడా ఇచ్చారట.కాంగ్రెస్‌తో చేతులు కలపాలని కేంద్ర మంత్రి జేడీ శీలం కోరారు.
పవన్ కాంగ్రెస్‌తో కలిస్తే బడుగు బలహీన వర్గాలకు ఉపయోగం చేకూరుతుందని సూచించారట.అదేవిధంగా కాంగ్రెస్‌కు పవన్ తోడైతే అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారట.

అలాగే 28మంది ఎంపీలు ఉండి కూడా వైసీపీ ప్రత్యేక హోదాపై నోరు మెదపక పోవడం సిగ్గు చేటని అన్నారు.అమరావతిని కుక్కలు చింపిన విస్తరిలా చేశారని మండిపడ్డారు.పోలవరాన్ని ఇప్పటి వరకు సాధించలేకపోయారంటూ ఎద్దేవా చేశారు.ఇసుక అమ్మకాల్లో నాడు టీడీపీ ప్రభుత్వం కిటికీలు తెరిస్తే.నేడు వైసీపీ మాత్రం ఏకంగా తలుపులే తెరిచిందంటూ విరుచుకుపడ్డారు.యూపీలో బీజేపీని గెలిపించేందుకే ఎంఐఎం,బీఎస్‌పీ తదితర పార్టీలు పోటీ డ్రామా ఆడారన్నారు.
మరి కాంగ్రెస్ జనసేన అధినేత పవన్‌కు ఇచ్చిన ఈ బిగ్ ఆఫర్ పట్ల ఆయన ఎలా స్పందిస్తారన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.







