రాష్ట్రంలో సామాన్యులకు, ప్రతిపక్షాలకు లా అండ్ ఆర్డర్ అమలు కాదు..ఆనం వెంకట రమణారెడ్డి.

లోకేశ్( Nara Lokesh ) పై జరిగిన కోడిగుడ్లదాడిపై పోలీసుల వ్యాఖ్యలు పచ్చిబూటకాలు.చంద్రబాబు, లోకేశ్, టీడీపీనేతలపై దాడిచేస్తే భావప్రకటనా స్వేచ్ఛా, వైసీపీవారిపై దాడిజరిగితే హత్యాయత్నమా? లోకేశ్ తమతో సెల్ఫీ దిగలేదన్న అక్కసుతో కోడిగుడ్లు విసిరారని చెప్పడం పిచ్చికథే.ఘటన జరిగిననాడే నిందితుల్ని మీడియా ప్రజలకుచూపిస్తే, వారిని పట్టుకోవడానికి పోలీసులకు వారంపట్టింది.ఆనం వెంకట రమణారెడ్డి( Anam Venkata Ramana Reddy ).“పొద్దుటూరులో నారాలోకేశ్ గారిపై కోడిగుడ్లతో దాడిచేసినవారిని పట్టుకోవడానికి రాష్ట్రపోలీసులకు వారంరోజులు పట్టింది.

 Law And Order Is Not Implemented For The Common Man And The Opposition In The St-TeluguStop.com

తమతో సెల్ఫీ దిగలేదన్నఅక్కసుతోనే ఇద్దరుయువకులు లోకేశ్ పై కోడిగుడ్లు విసిరారు అంటున్న పోలీసులవ్యాఖ్యలు పచ్చిబూటకంగా ఉన్నాయి.

లోకేశ్ గారిపై టీడీపీనేతలపై వైసీపీమూకలు, కిరాయిగాళ్లు ఎవరుదాడిచేసినా ఇలాంటి పిచ్చికథలే చెబుతారా?చంద్రబాబు( Chandrababu Naidu _గారిపై అమరావతిలో దాడిజరిగిప్పుడు అప్పటి డీజీపీ దాన్ని భావప్రకటన స్వేఛ్చగా అభివర్ణించారు.అదేటీడీపీ వాళ్లు ఏదైనా దాడిచేస్తే వారిపై మాత్రం 307కింద హత్యాయత్నం కేసులుపెడుతున్నారు.

ఎస్సీఎస్టీ అట్రాసిటీకేసులు పెడుతున్నారు.

మరీ ఇంతఏకపక్షంగా పోలీసులు వ్యవహరించడం నిజంగా సిగ్గుచేటు.

పోలీసులకు మీడియాఅన్నా, ప్రజలన్నా ఏమాత్రం బెరుకులేదు.లోకేశ్ గారిపై దాడిచేసినవారిని అప్పుడే మీడియావారు ప్రజలకు చూపించారు.

కానీ పోలీసులకుమాత్రం వారంపట్టింది.రాష్ట్రంలో సామాన్యులకు, ప్రతిపక్షాలకు లా అండ్ ఆర్డర్ అమలుకాదు.

వైసీపీనేతలు, కార్యకర్తలకోసం మాత్రమే అదిసక్రమంగా పనిచేస్తుంది.మరీముఖ్యంగా టీడీపీనేతలకు ఏంజరిగినా అది భావప్రకటనస్వేచ్ఛ కిందకే వస్తుంది.

లేకపోతే ఏవోకట్టుకథలు అల్లుతారు.డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు అందరిదీ ఇదేతంతు.

తమ విధినిర్వహణ ఏంటనేది పోలీసులు గుర్తించాలి.ప్రజలకోసం పనిచేయాలిగానీ, వ్యవస్థలపరువు తీసేవారికోసం చట్టాల్ని తుంగలోతొక్కవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube