టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన లావణ్య త్రిపాఠి నటించిన హ్యాపీ బర్త్ డే సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమా బిలో యావరేజ్ అని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని లావణ్య త్రిపాఠి ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య త్రిపాఠి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సోగ్గాడే చిన్నినాయన సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి బంగార్రాజు సినిమాలో మాత్రం అస్సలు కనిపించలేదు.బంగార్రాజు సినిమాలో ఎందుకు నటించలేదనే ప్రశ్న ఎదురు కాగా నాగచైతన్యకు నేను తల్లి పాత్రలో నటిస్తే బాగోదని లావణ్య కామెంట్లు చేశారు.
తాను ఆ పాత్రలో నటించినా ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని ఆమె చెప్పుకొచ్చారు.నాగార్జున సార్ ఇదే విషయాన్ని ఫోన్ చేసి నాకు చెప్పారని లావణ్య త్రిపాఠి కామెంట్లు చేశారు.

నాగార్జున సార్ బంగార్రాజు సినిమాలో నా పాత్ర లేదని చెప్పిన వెంటనే నేను ఊపిరి పీల్చుకున్నానని ఆమె పేర్కొన్నారు. యుద్ధం శరణం మూవీలో నేను చైతన్యకు జోడీగా నటించానని ఆమె కామెంట్లు చేశారు.ఒక సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటించిన నేను మరో సినిమాలో చైతన్యకు తల్లి పాత్రలో నటించడం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.లావణ్య చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒక స్టార్ హీరోతో లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారంలోకి రాగా వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించిన శుభవార్త చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సినిమాసినిమాకు లావణ్య త్రిపాఠికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.