అందాల భామ లావణ్య త్రిపాఠి సినిమాల కన్నా తన ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.పదేళ్ల క్రితం వచ్చిన అందాల రాక్షసి సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు వరుస సినిమాలైతే చేస్తున్నా స్టార్ క్రేజ్ దక్కించుకోవడంలో విఫలమైంది.
ఈ క్రమంలో యువ హీరోలతో కూడా నటిస్తూ వస్తుంది.అయితే అమ్మడికి లక్ మాత్రం కలిసి రావట్లేదు.
ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందించట్లేదు.
ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తన ఫోటో షూట్స్ తో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని అలరిస్తుంది లావణ్య.
లేటెస్ట్ గా లావణ్య త్రిపాఠి ట్రెడిషనల్ వేర్ లో అందమైన బుట్టబొమ్మగా కనిపిస్తుంది. అందాల లావణ్యాని అలా చూస్తూ ఉండిపోవాలనిపించేలా అమ్మడి ఆకర్షణ ఉంది.ఫోటో షూట్స్ లో తన స్టైల్ వేరే అనేలా అమ్మడు సత్తా చాటుతుంది.లావణ్య త్రిపాఠి చేస్తున్న ఈ ఫోటో షూట్స్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇస్తున్నాయి.
సినిమాల విషయంలో లావణ్య అనుకున్నంత దూకుడు చూపించట్లేదు. ఇప్పటికీ సరైన ఛాన్స్ వస్తే తన టాలెంట్ చూపిస్తా అంటుంది లావణ్య.
రీసెంట్ గా అమ్మడు నటించిన హ్యాపీ బర్త్ డే కూడా నిరాశపరచింది.







