మెగా ఫ్యామిలీలోకి కోడలిగా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) జాతకం అదృష్ట జాతకం అని కామెంట్లు వినిపిస్తున్నాయి.పదేళ్ల నుంచి లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీలో ఉన్నా ఆమె ఎప్పుడూ వివాదాల ద్వారా వార్తల్లో నిలవలేదు.
వరుణ్ తేజ్ ( Varun Tej )లావణ్య చాలా సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నా ఆ ప్రేమ విషయం స్వయంగా వాళ్లు వెల్లడించే వరకు చాలామందికి తెలియదు.అయితే లావణ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీలో విడిపోయిన ఒక జంట కలవబోతుందని తెలుస్తోంది.
మెగా కుటుంబానికి చెందిన ఒక జంట తమ మధ్య వచ్చిన మనస్పర్ధలను పరిష్కరించుకుని మళ్లీ కలిసి జీవనం సాగించాలని ఫిక్స్ అయ్యారని సమాచారం.విమర్శలకు తావివ్వకూడదనే ఆలోచనతో వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఆ జంట తీసుకున్న నిర్ణయం మెగా ఫ్యామిలీకి కూడా సంతోషాన్ని కలిగించిందని సమాచారం.త్వరలో ఈ జోడీ మీడియా ముందు కలిసి కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు మెగా కోడలు లావణ్య త్రిపాఠి కెరీర్ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.లావణ్య సినిమాల్లో కొనసాగినా, ఏదైనా వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చినా మెగా ఫ్యామిలీ నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభించనుందని సమాచారం అందుతోంది.మెగా ఫ్యామిలీ స్థాయిని మరింత పెంచేలా లావణ్య త్రిపాఠి నిర్ణయాలు నిర్ణయాలు ఉండనున్నాయని సమాచారం.
లావణ్య త్రిపాఠి తన సినీ కెరీర్ లో గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉన్నారు.వరుణ్ లావణ్య కాంబోలో గతంలో తెరకెక్కిన సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు.వరుణ్ లావణ్య కలిసి నటించి ఈ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
వరుణ్ తేజ్ లావణ్య జోడీ క్యూట్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.