న్యాయమూర్తులను దూషించిన కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ అయ్యాయి.ఈ మేరకు టీడీపీ నాయకులు గోరంట్ల, బుద్దా వెంకన్నతో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టిన వారికి ఇప్పటికే ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.







