Sobha Shetty : అది లేకపోతె శోభాశెట్టి అసలు ఉండలేదా…చివరికి అక్కడ కూడా ఆ పని చేస్తుందా?

బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి శోభా శెట్టి ( Sobha Shetty ) ఒకరు.ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్నారు.

 Latets News About Bigg Boss Contestent Shobha Shetty-TeluguStop.com

ముఖ్యంగా తెలుగులో ఈమె కార్తీకదీపం( Karthika Deepam ) సీరియల్ లో మోనిత ( Monitha ) పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా బుల్లితెర సీరియల్స్ మాత్రమే కాకుండా ఈమె పలు కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఇకపోతే శోభ శెట్టి కన్నడ సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో కూడా నటించారు.ఇలా పలు సినిమాలలో నటిస్తూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన స్టైల్ లో ఆట ఆడుతూ ఇప్పటివరకు హౌస్ లో కొనసాగుతున్నారు.అయితే శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుంది అంటూ ప్రతివారం వార్తలు వచ్చిన ఈమె మాత్రం సేఫ్ అవుతూ వస్తుంది.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి శోభాశెట్టికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.గత సోమవారం నామినేషన్స్ లో భాగంగా ఈ నామినేషన్స్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో అందరూ నామినేషన్ లో పాల్గొంటూ ఉండగా ఈమె మాత్రం ఏకంగా లిప్ స్టిక్ వేస్తూ ముస్తాబ్ అవుతోంది.ఇక ఈ వీడియో పై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో కామెంట్స్ వస్తున్నాయి.

శోభా శెట్టి మేకప్ ( Make up ) లేకుండా అసలు ఉండలేరని మేకప్ లేకుండా ఆమెను మనం అసలు చూడలేము గుర్తుపట్టలేము అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరికొందరు మాత్రం ఈ వీడియో పై స్పందిస్తూ అందరూ నామినేషన్స్ లో టెన్షన్ పడుతూ ఉండగా ఈమె మాత్రం ఎంచక్కా మేకప్ అవుతూ ఉన్నారని ఇప్పుడు కూడా ఈ మేకప్ వేసుకోవడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఏది ఏమైనా శోభా శెట్టిని మేకప్ లేకుండా మాత్రం చూడలేమని ఆమె మేకప్ వేసుకుంటేనే బాగుంటుంది అంటూ ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లిన తర్వాత శోభ శెట్టికి సంబంధించి మేకప్ లేని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో ఈమె మేకప్ లేకుంటే ఇంత చండాలంగా ఉంటారా అంటూ కూడా అప్పట్లో ఈమెపై ఎన్నో రకాల కామెంట్స్ వచ్చాయి.తాజాగా ఈ వీడియో కూడా బయటకు రావడంతో ఈమె పట్ల చాలామంది వివిధ రకాలుగా మీమ్స్ కూడా వైరల్ చేస్తున్నారు.

అయితే ఈ వారం శోభా శెట్టి బయటకు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఈ వారం బిగ్ బాస్ ఆమెను బయటకు పంపుతారా లేకపోతే యధావిధిగా సేవ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube