మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘భోళా శంకర్( Bholaa Shankar )’ ఒకటి.గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు సక్సెస్ లను అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహ లాడుతున్నాడు.
అందుకే ఫుల్ ఫోకస్ తో తన నెక్స్ట్ సినిమా భోళా శంకర్ ను పూర్తి చేస్తున్నాడు.
తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ ( Meher Ramesh )డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా షూట్ గురించి ఒక అప్డేట్ వచ్చింది.మెహర్ రమేష్ ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు.ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో సాంగ్ షూట్ పూర్తి చేశామని.అక్కడ వాతావరణంలో షూట్ చేయడం కాస్త కష్టతరంగా ఉంది అని అయినా కూడా విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు.

ఇక ఈ క్రమంలోనే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇతర సిబ్బందికి కూడా థాంక్స్ చెబుతూ మెహర్ ఇచ్చిన అప్డేట్ మెగా ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ గా మారింది.ఎట్టకేలకు ఒక్కో అప్డేట్ పూర్తి చేస్తున్న తాజాగా సాంగ్ ను పూర్తి చేసారు.స్విట్జర్లాండ్ లాంటి దేశంలో సాంగ్ అంటే కొద్దిగా రొమాంటిక్ అనే అర్ధం అవుతుంది.చూడాలి ఈ సాంగ్ లో విజువల్స్ ఎలా ఆకట్టు కుంటాయో.

ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్( Keerthy Suresh ) చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో అక్కినేని యువ హీరో సుశాంత్ కూడా కీలక రోల్ పోషిస్తున్నాడు.మరి ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.







