సమయం( Time ) అనేది మన దైనందిత జీవితంలో ఓ భాగం అయిపోయింది.కాదు కాదు సమయమే జీవితం.
ఇక్కడ సమయం వృధా చేసినోడు జీవితాన్ని వృధా చేసినట్టే.పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే దాకా అంతా టైమ్ ప్రకారం జరుగుతుంది.
వాచీలోనో, ఫోన్‌లోనో టైమ్ చూసుకుంటూ మన పెరుగుని ఆరంభిస్తాం.భూమిమీద సరే, మనిషి అంతరిక్షంలోకి ( Space ) వెళ్ళినపుడు సమయం పరిస్థితి ఏమిటి? మరీ ముఖ్యంగా చంద్రుడిపై( Moon ) సమయం, తేదీలను ఎలా లెక్కిస్తారు?

ఇలాంటి అనుమానం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది.మానవ నాగరికత అభివృద్ధి మొదలైన తొలి నాళ్లలో అంతరిక్షంలోని నక్షత్రాలు, సూర్య, చంద్రుల స్థితిగతుల ఆధారంగా సమయాన్ని లెక్కించేవారు మన పూర్వీకులు.మనుషులు భూమికి పరిమితమైనంత కాలం ఇది ఓకే, కానీ అంతరిక్ష ప్రయోగాలు, స్పేస్‌లోకి మను షులు వెళ్లిరావడం, భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లేందుకు ప్రయోగాలు వంటి వాటితో.
ఏ ‘టైమ్’ను అనుసరించాలనే ఆలోచనలు ఇపుడు మొదలయ్యాయి.

ఇపుడు చంద్రుడిపై మనిషి నివాసం ఏర్పర్చు కున్నాక అక్కడ సమయం సంగతి ఏంటనే సందేహాలు మొదలయ్యాయి.భూమ్మీదిలా పగలు, రాత్రి కలిపి ఒక రోజుగా లెక్కిద్దామంటే అక్కడ కష్టం.ఎందుకంటే చంద్రుడిపై సుమారు 15 రోజులు పగలు, మరో 15 రోజులు రాత్రి ఉంటాయి ఈ సమస్యను అధిగమించడానికి, భూమ్మీది సమయానికి సులువుగా అనుసంధానం చేయగలగడానికి ఒక ప్రతిపాదన ఆలోచిస్తున్నారు.30 సైకిల్స్ కలిస్తే ఒక పూర్తి మూన్‌డేగా పరిగణించాలని ఆలోచన.అంటే మనకు ఒక నెల ఒక మూన్‌డే అవుతుంది.
మనకు ఒక రోజు ఒక మూన్ సైకిల్‌గా లెక్కించొచ్చన్నమాట.అయితే దీన్ని ఇంకా అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది.







