తెలంగాణలో ఇప్పుడు రేవంత్ వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్టుగా తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది.టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరికించేందుకు రేవంత్ రెడ్డి పట్నం గోస అంటూ తన మల్కజ్ గిరి పార్లమెంట్ పరిధిలో యంత్రం చేపట్టి టీఆర్ఎస్ అగ్ర నాయకులు కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేసుకున్నారు.
పాదయాత్ర చేపట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన పై గతంలో ఉన్న పెండింగ్ కేసుల వ్యవహారాన్ని తెలంగాణ అధికార పార్టీ తెరమీదకు తెచ్చింది.గతంలో ఆయన భూ ఆక్రమణకు పాలపడినట్టుగా తగిన సాక్షాధారాలు సంపాదించింది.
దీనిపైన కేసులు కూడా బుక్ చేసింది.దీంతో మంత్రి కేటీఆర్ అవినీతి వ్యవహారాలు ప్రజల ముందుంచాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రయత్నించారు.
కేటీఆర్ లీజుకి తీసుకున్న ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరా తో తన అనుచరుల ద్వారా చిత్రీకరించడం, ఆ వ్యవహారం రేవంత్ రెడ్డి అరెస్ట్ వరకు వెళ్ళింది.ఇంత జరుగుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచి రేవంత్ కు మద్దతు లభించలేదు.
రేవంత్ రెడ్డి ఒక్కడే ఈ వ్యవహారంలో చిక్కుకున్నారు.పార్టీకి మైలేజ్ తీసుకువచ్చే విధంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై దూకుడు ప్రదర్శిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమకు ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదు.
మొన్నటి వరకు పిసిసి అధ్యక్ష పదవి కోసం రేవంత్ కాంగ్రెస్ సీనియర్లు అన్నట్టుగా ఈ వ్యవహారం నడిచింది.
రేవంత్ అరెస్ట్ అవడం తో తమకు అడ్డు తొలగింది అన్నట్టుగా సీనియర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.పార్టీల నుంచి ఇప్పటికే బలమైన నాయకులు, కార్యకర్తలు వెళ్లిపోయినా మార్పు కనిపించడం లేదు.
ఎప్పటిలాగే గ్రూపు తగదాలతో రాజకీయం చేసుకుంటూ పార్టీని నిట్ట నిలువునా ముంచుతున్నారు.ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే ఆయనకు అండగా కాంగ్రెస్ సీనియర్లు కూడా పోరాటం చేసి ఉంటే ఆ వ్యవహారం మరోలా ఉండేది.
అది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం గా మారి టిఆర్ఎస్ కూడా కాస్త వెనుకడుగు వేసేది.
కానీ తమ గొంతు వినిపించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముందుకు రాకపోవడం లేదు.
తమ రాజకీయ ప్రత్యర్ధులు ఎవరు తమకు ఎదురు తిరిగినా పరిస్థితి ఇలాగే ఉంటుందని టిఆర్ఎస్ ఈ విధంగా సంకేతాలు ఇచ్చింది.రేవంత్ వ్యవహారం మరి కొద్ది రోజుల్లో సద్దుమణిగినా ఈ వ్యవహారంతో కాంగ్రెస్ బలం ఏంటో, తెలంగాణలో పరిస్థితి ఏంటో అందరికీ అర్థమైపోయింది.
పార్టీని గట్టెక్కించేందుకు నాయకులు ముందుకు రావడం లేదు.వారు తమ ప్రయోజనాలు నెరవేరితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.