'SSMB28'లో సూపర్ స్టార్ అలా కనిపిస్తాడా.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే?

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో మహేష్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఈ సినిమా రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్లినా రెగ్యులర్ షూట్ జరగడం లేదు.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

ఈ సినిమా షూటింగ్ రెగ్యురల్ గా జరగ కుండానే అప్పుడే రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్ కు మస్తు ఖుషీ అందించాడు.త్రివిక్రమ్ ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఇక మహేష్ ఈ సినిమా కోసం కొత్త లుక్ లోకి మారిపోయాడు.దీంతో రోజుకొక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

తాజాగా నిన్న ఒక ఫోటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే.మహేష్ బాబు షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది.

ఈ ఫోటోలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.అయితే ఈ ఫొటోతో ఒక విషయం త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చారు అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ ఫోటో ద్వారా ఏమర్థం అయ్యింది అంటే.ఈ సినిమాలో త్రివిక్రమ్ మహేష్ సిక్స్ ప్యాక్ బాడీ చుపిస్తాడేమో.అందుకే ఎప్పుడు లేనిది ఇలా షర్ట్ లేని ఫొటోల్లో ఈయన దర్శనం ఇచ్చాడు అని.ఇదే త్రివిక్రమ్ ఇచ్చిన హింట్ అని అనుకుంటున్నారు.మొత్తానికి త్రివిక్రమ్ మహేష్ లోని కొత్త కోణాన్ని ఫ్యాన్స్ కు పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తుంది.11 ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.

హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

తాజా వార్తలు