Brahmani: బ్రహ్మణి హీరోయిన్ కాకుండా అడ్డుపడ్డారా.. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారా?

సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోలు తమ పిల్లలను తమ వారసులుగా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉన్నారు.

ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్ల పిల్లలు ఇండస్ట్రీలో హీరోలుగాను హీరోయిన్లు గాను కొనసాగుతూ ఉన్నారు.

ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకున్నారో మనకు తెలిసిందే.ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

త్వరలోనే ఈయన వారసుడు మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీలోకి రాబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.అయితే మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ కూడా దాదాపు కన్ఫర్మ్ అయిందని తెలుస్తుంది.

ఇక బాలకృష్ణకు మోక్షజ్ఞతో పాటు బ్రాహ్మణి( Brahmini ) తేజస్విని( Tejaswini ) అనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరూ కూడా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు హీరోయిన్లకు మించిన అందంతో ఉన్నటువంటి బాలయ్య వారసురాలు మాత్రం ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా అడుగు పెట్టలేదు.

Advertisement

నారా బ్రాహ్మిని ఫారెన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.ఉన్నతమైన చదువులు చదివినటువంటి ఈమె చూడటానికి కూడా కుందనపు బొమ్మలా ఉండడంతో తప్పకుండా ఈమె బాలకృష్ణ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుందని అందరూ భావించారు.

ఇలా బ్రాహ్మిని చదువు మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలోకి వస్తుందని భావించినటువంటి కొంతమంది దర్శకనిర్మాతలు బాలకృష్ణ వద్దకు వెళ్లి తమ కూతురిని హీరోయిన్గా పరిచయం చేస్తామని చెప్పినప్పటికీ బాలకృష్ణ అందుకు ఒప్పుకోలేదని తెలుస్తుంది.ఇలా బాలయ్య తన కూతురిని ఇండస్ట్రీలోకి పంపించడానికి ఒప్పుకోకపోవడంతో తన కుమార్తె సినీ కెరియర్ కు బాలకృష్ణనే అడ్డుపడుతున్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.నిజానికి సినిమా ఇండస్ట్రీలో( Cinema Industry ) కొనసాగాలి అనే ఆలోచన బ్రాహ్మణికి లేకపోవడంతోనే బాలయ్య అలా చెప్పారని తెలుస్తుంది.

సీనియర్ నటుడు ఎన్టీ రామారావు గారికి( Sr NTR ) మనవరాలుగా బాలకృష్ణ కుమార్తెగా ఎంతో సినీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి బ్రాహ్మినికి చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు అంటే పెద్దగా ఆసక్తి లేకపోవడమే అందుకు కారణం.చిన్నప్పటి నుంచి కూడా బ్రాహ్మినికి వ్యాపార రంగంలో కొనసాగాలి అనే ఆసక్తి ఎక్కువగా ఉండడంతో చదువులు కూడా అదే రంగం వైపే పూర్తి చేశారు ఇలా చదువు పూర్తి కాగానే ఈమె బిజినెస్ (Business) రంగంలోకి అడుగు పెట్టారు.ఇలా సినిమాలు అంటే ఏమాత్రం ఇష్టం లేనటువంటి బ్రాహ్మణి అభిరుచులను తెలుసుకున్నటువంటి బాలయ్య తనకు ఇష్టమైన రంగంలోనే తనని ప్రోత్సహించారని అందుకే ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారని తెలుస్తుంది.

ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె నారావారి ఇంటి కోడలుగా అడుగుపెట్టారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ (Lokesh) కి బ్రాహ్మణిని ఇచ్చి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేశారు ఇలా నారావారి ఇంటి కోడలుగా అడుగుపెట్టినటువంటి బ్రాహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ సంస్థలను( Heritage ) ఎంతో విజయవంతంగా ముందుకు నడుపుతున్నారు.దీనితోపాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్( Basavatarakam Cancer Hospital ) బాధ్యతలను కూడా బ్రాహ్మణి ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారని చెప్పాలి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు