తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఒకరు.అల్లు అరవింద్ కుమారుడిగా అల్లు రామలింగయ్య మనవడిగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టినటువంటి అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి ఈయన సుకుమార్ దర్శకత్వంలో నటించినటువంటి పుష్ప ( Pushpa ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈయనకు భారీ స్థాయిలో అభిమానులు కూడా పెరిగిపోయారు.ఇక ఈ సినిమా ఎంతో విజయవంతం కావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా అది ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఇలా వృత్తిపరమైనటువంటి జీవితంలో అల్లు అర్జున్ ఎంతో మంచి సక్సెస్ సాధించారు.

ఈయన కెరియర్ లో ఇంత మంచి సక్సెస్ అందుకోవడానికి తన భార్య స్నేహారెడ్డి ( Sneha Reddy ) కూడా కారణమని చెప్పాలి.స్నేహారెడ్డి కుటుంబ విషయాలను పిల్లల విషయాలను అల్లు అర్జున్ పై ఒత్తిడి తీసుకురాకుండా ఈ విషయాలన్నింటినీ ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉండటం వల్ల అల్లు అర్జున్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టారు.దీంతో ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.
ఇక అల్లూ స్నేహ రెడ్డి సినిమా ఇండస్ట్రీకు పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ ఈమె తన ఫ్యామిలీ విషయాలతో పాటు తన పిల్లల విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇకపోతే అల్లు అర్జున్ స్నేహారెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం.
ఇప్పటికే అర్హ ( Arha ) బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా అయాన్ ( Ayaan ) మాత్రం సినిమాలలో నటించకపోయిన అందరికీ ఎంతో సుపరిచితమే.తరచూ తన పిల్లల ఫోటోలు వీడియోలను స్నేహ రెడ్డి అభిమానులతో పంచుకుంటారు.
ఇక గత ఏడాది జనవరి ఒకటో తేదీ సందర్భంగా ఈమె తన రీ సొల్యూషన్ ఏంటి అంటే తన కొడుకుకి వంట నేర్పించడం అంటూ కామెంట్లు చేశారు.అయితే తాను చెప్పిన విధంగానే పలు సందర్భాలలో అయాన్ చేత వంటలు చేయిస్తూ కిచెన్ లో కనిపించారు.

ఇకపోతే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా మరొక వీడియోని షేర్ చేశారు.ఇందులో భాగంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈమె కేక్ (Cake) తయారు చేయించారు.తాను కేక్ ఎలా చేయాలో చెబుతూ ఉండగా ఇద్దరు కూడా కేక్ తయారు చేయడంలో నిమగ్నమయ్యారు.ఇలా వీరిద్దరూ కేక్ తయారు చేసినటువంటి వీడియోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.
దీంతో అభిమానులు చాలా క్యూట్ క్యూట్ గా కేక్ తయారు చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.







