ప్రభాస్ - మారుతి మూవీ క్రేజీ అప్డేట్.. ఆ వర్క్ అప్పుడే స్టార్ట్ అట!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.ఈ సిరీస్ తర్వాత ఈయన మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరిగింది.

 Latest Buzz On Prabhas-maruthi Movie , Prabhas, Maruthi, Raja Deluxe, Thaman-TeluguStop.com

అందుకే ఈయన చేస్తున్న సినిమాలపై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.బాహుబలి ( Bahubali )తర్వాత ప్రభాస్ మళ్ళీ మరో సినిమా హిట్ అందుకోక పోయిన కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు.

డార్లింగ్ నటిస్తున్న సినిమాల్లో మారుతి( Maruti ) సినిమా కూడా ఉంది.ఈ సినిమా ప్రభాస్ మిగిలిన ప్రోజెక్టుల కంటే కాస్త తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

ముందు ఈ సినిమా గురించి తెలిసి ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందిన కూడా ఈ హారర్ కాన్సెప్ట్ అని తెలిసి కాస్త ఇంట్రెస్ట్ పెడుతున్నారు.ప్రభాస్ మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ రాజా డీలక్స్ అని తెలుస్తుంది.

ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

Telugu Latestbuzz, Maruthi, Prabhas, Raja Deluxe, Thaman-Movie

ఇప్పటి వరకు అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అనౌన్స్ మెంట్ కూడా రాలేదు.కానీ ఈ సినిమా షూట్ మాత్రం పూర్తి అవుతుంది.ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ అందుతుంది.

ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్( Thaman ) సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.మరి థమన్ ఈ సినిమా కోసం జూన్ ఫస్ట్ వీక్ నుండి తన వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడు అట.

Telugu Latestbuzz, Maruthi, Prabhas, Raja Deluxe, Thaman-Movie

ఈ సినిమా కోసం మరి థమన్ ఎలాంటి మ్యూజిక్ అందిస్తారో ఎదురు చూడాలి.ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్ ( Malvika Mohanan )మెయిన్ హీరోయిన్ గా కనిపిస్తుంది.మొత్తానికి మారుతి ప్రభాస్ తో ఎలా ప్లాన్ చేస్తున్నాడో అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను 100 కోట్ల లోపులోనే పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube