కూతురు అలా అడగటంతో అవాక్కైన బాలీవుడ్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?

సినీ నటిగా, మన దేశం నుంచి విశ్వసుందరిగా ఎంపికైన రెండో యువతిగా లారాదత్తా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.యూపీలోని ఘజియాబాద్ లో 1978 సంవత్సరంలో లారాదత్తా జన్మించారు.

లారాదత్తా తల్లి ఆంగ్లో ఇండియన్ కాగా తండ్రి పంజాబ్ కు చెందిన వింగ్ కమాండర్ కావడం గమనార్హం.లారాదత్తా అక్క ప్రస్తుతం వాయుసేనలో పని చేస్తున్నారు.

లారాదత్తా 2000 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికయ్యారు.లారా దత్తా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించడంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

టెన్నిస్ చాంఫియన్ అయిన మహేష్ భూపతిని లారాదత్తా వివాహం చేసుకున్నారు.లారా దత్తా మహేష్ భూపతిల కూతురు వయస్సు ప్రస్తుతం 9 సంవత్సరాలు కాగా కూతురు అడిగే ప్రశ్నలు తనను ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయని ఆమె తెలిపారు.

Advertisement

తన కూతురు 4 సంవత్సరాల వయస్సులో డైవోర్స్ అంటే ఏమిటని అడిగిందని లారా దత్తా అన్నారు.ప్రస్తుతం తన కూతురు మరో ప్రశ్న అడిగిందని ఆ ప్రశ్నకు ఏ విధంగా సమాధానం చెప్పాలో తనకు అర్థం కాలేదని ఆమె అన్నారు.

కొన్ని రోజుల క్రితం తన కూతురు బ్రోతల్ అంటే ఏంటని ప్రశ్నించిందని అలాంటి పదాలు చిన్నపిల్లల చెవుల్లో పడటం ఆశ్చర్యకర పరిణామం అని ఆమె వెల్లడించారు.అయితే కూతురు ప్రశ్నకు ఏ సమాధానం ఇచ్చారనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.

అయితే అలాంటి పదం తన కూతురి చెవిలో పడిన తర్వాత తాను అబద్ధం మాత్రం చెప్పనని ఆమె వ్యాఖ్యలు చేశారు.తాను తన కూతురి జీవితంలో అబద్ధాలు చెప్పే తల్లిగా మిగిలిపోకూడదని ఆమె తెలిపారు.అయితే ఈ విధమైన చర్చలు కొనసాగాలని ఆమె చెప్పుకొచ్చారు.

లారాదత్తా తాజాగా హికప్స్ అండ్ హుకప్స్ అనే వెబ్ సిరీస్ చేయగా ఈ వెబ్ సిరీస్ లో టీనేజ్ అమ్మాయికి తల్లిగా లారాదత్తా కనిపించారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు