ఆశ్చర్యం: నీటితో వెలుగుతున్న దీపాలు...ఎక్కడో తెలుసా!

నీటితో దీపాలు వెలిగించడం ఏంటి అని అనుకుంటున్నారా.నిజంగా ఇది నిజం మధ్యప్రదేశ్ లోని సాజాపూర్ జిల్లా లో ఈ వింత చోటుచేసుకుంది.

అక్కడ ఒక దేవాలయంలో దేవుడికి నూనె తో పని లేకుండా నీటితో దీపారాధన చేస్తున్నారు.మధ్యప్రదేశ్‌లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ నది ఒడ్డున ఉన్న గడియాఘాట్ మాతాజీ మందిరంలో ఈ అద్భుతం కనిపిస్తుంది.

గత ఐదేళ్ల నుంచి ఈ అఖండ జ్యోతి వెలుగులు పంచుతూనే ఉంది.అయితే ఈ జ్యోతి వెలగడం కోసం అక్కడ నూనె ను కాదు నీటిని ఉపయోగించి దీపం వెలిగిస్తారు.

ప్రమిదలో నిత్యం నూనెకు బదులు నీటిని పోస్తే చాలు వెలుగుతూనే ఉంటుందన్నారు.ఆలయ పూజారి సిందూ సింగ్ మాట్లాడుతూ.

ఇంతకు ముందు నూనెతోనే దీపారాధన చేసేవారం.కానీ ఒక రోజు అమ్మవారు కలలో కనిపించి నీటితో జ్యోతి వెలిగించమని చెప్పడం తో అప్పటినుంచి నీటితోనే దీపం వెలిగిస్తున్నట్లు తెలిపారు.

ఆశ్చర్యం: నీటితో వెలుగుతున్న �

అయితే అప్పటి నుంచి దీపం నిరంతరాయంగా వెలుగుతూనే ఉందని, కానీ తాను నీటితో దీపాన్ని వెలిగిస్తున్నానని చెబితే ఎవరూ నమ్మరని చాలా కాలం ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని తెలిపారు.ఈ ఆలయం నదీ తీరంలో ఉండడం వలన వర్షాకాలంలో పూర్తిగా నీట మునుగుతుంది.దీంతో వర్షాకాలమంతా ఆలయాన్ని మూసే ఉంచుతారు నిర్వాహకులు.మళ్లీ దసరా నవరాత్రులకు ఆలయాన్ని తెరిచి పూజాలు నిర్వహిస్తూ ఉంటారు.నిజంగా ఇలాంటి విషయాలు వింటుంటే దేవుడు నిజంగా ఉన్నాడు అని అనిపిస్తూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube