నిన్న నందమూరి తారక రామాావు గారి 19వ వర్ధంతి సంధర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ఎందరో ప్రముఖులలో ఆయన సతీమణి లక్ష్మి పార్వతి సైతం ఉన్నారు.అయితే ఆమె మీడియాతో మాట్లాడుతూ పాడిన పాటనే మళ్లీ.మళ్లీ.అందుకున్నారు…సీమాంధ్రలో చంద్రబాబు నాయుడు పాలన చూసి ఎన్టిఆర్ ఆత్మ ఘోషిస్తుందని, రాష్ట్రానికి కావాల్సింది స్మార్ట్ సిటీలు కాదని, పేద ప్రజలకు పట్టెడన్నం అని చంద్ర బాబును షరా మామూలుగా ఏకి పడేశారు.అంతేకాకుండా ఎన్.టి.రామారావు జీవించి ఉంటే తెలుగు జాతి రెండుగా చీలేది కాదని ఆమె తెలిపారు.ఈ క్రమంలోనే కొందరు నాయకులు ఆమె గతంలో సైతం ఇలానే మాట్లాడింది అని, ఇప్పుడు ఎన్టీఆర్ గురించి చెబుతున్న ఆమె వైఎస్సార్ బ్రతికి ఉంది ఉంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పడటం అసాధ్యం అయ్యేది అని సైతం తెలిపినట్లు వాపోతున్నారు.
ఇక ఆమె వైకాపాలో ఉండటం వైఎస్ఆర్ నామస్మరణ చేయడం మామూలే కానీ, అసలు ఆమె మాటల ప్రకారం చూస్తే రాష్ట్ర విభజన జరకుండా ఆపగలిగే సత్తా ఎన్టీఆర్.వైఎస్ఆర్ లో ఎవరికి ఉందో కొంచెం క్లారిటీ ఇస్తే బావుండేది పార్వతమ్మా.