ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలలో రాజకీయ సమీకరణాలు ఊపందుకున్నాయి.ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశం లో అత్యంత వేగంగా మార్పులు చేర్పులు జరిగిపోతున్నాయి మారుతున్న కాలానికి అనుగుణంగా చంద్రబాబు ఆలోచనలు కూడ వేగంగా ఉంటున్నాయి అందులో భాగంగా విజయవాడ కేంద్రంగా రాజకీయాలు మాంచి ఊపు అందుకున్నాయి.కాంగ్రెస్ లో ఒక బలమైన నేతగా అవతరించి విభజన అనంతరం సైలెంట్ గా ఉంటూ సర్వేల ఆధారంగా పార్టీలలో నేతల్లో గుబులు రేపుతున్న లగడపాటి రాజ్ గోపాల్

త్వరలో చంద్రాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారని టాక్ వినిపిస్తోంది.లగడపాటి రీ ఎంట్రీ కి ఎంతో సమయం లేదని అంటున్నారు టీడీపీ నేతలు…2004, 2009 ఎన్నికల్లో వరసగా విజయవాడ లోక్‌సభ సీటు నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా విజయం సాధించిన ఆయన సమైఖ్యాంధ్ర పోరాటంలో హీరో అయ్యారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రాన్ని నిట్టనిలువున విభజించడంతో కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగరవేసిన రాజగోపాల్ ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
అయితే గత కొంతకాలంగా టీడీపీ లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్న ఆయన రాజగోపాల్ కి వైసీపీ నుంచీ ముందుగానే ఆఫార్ వచ్చిందట అయితే తన సర్వేలలో వైసీపీ కి సీన్ లేదని తేల్చుకుని టీడీపీ లోకి వెళ్ళడానికి సిద్దం అయ్యారట.
అందుకు చంద్రబాబు కూడా సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది అయితే ఈ క్రమంలోనే
విజయవాడ నుంచి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని బలంగా ఉండడంతో ఆయనను ఏలూరు లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం ఏలూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగంటి బాబును కైకలూరు నుంచి అసెంబ్లీ బరిలో దింపీ రాజగోపాల్‌ను లోక్‌సభకు అక్కడ నుంచి పోటీ చేయించేలా చంద్రబాబు వ్యూహం రచించారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఏలూరు లోక్‌సభ సీటు రేసులో టీడీపీ నుంచే ఇద్దరు, మగ్గురు పేర్లు వినిపిస్తుండడం మరొక విశేషం వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త దివంగత మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లిరామయ్య మనవడు బోళ్ల రాజీవ్‌తో పాటు సినిమా దర్శకుడు కే.రాఘవేంద్రరావు భంధువు పేరు కూడా వినిపిస్తోంది.అయితే మాగంటిని ఈ సారికి పక్కకి తప్పించి ఆయనకి కైకలూరు భాద్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.మరి ఏలూరు ఎంపీ స్థానంని చెదరని కంచుకోటగా నిలబెట్టుకుంటూ వస్తున్న మాగంటిని కాదని లగడపాటికి ఇచ్చే ధైర్యం చేయరని కూడా తెలుస్తోంది మరి చివరికి లగడపాటికి ఏ స్థానం ఫిక్స్ చేస్తారో వేచి చూడాలి.