మాజీ ఎంపీ హర్షకుమార్ ను లగడపాటి రాజగోపాల్ మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ మేరకు హర్షకుమార్ నివాసానికి వెళ్లిన లగడపాటి ఆయనతో భేటీ అయ్యారు.
తరువాత ఉండవల్లిని కూడా లగడపాటి రాజగోపాల్ కలవనున్నారని తెలుస్తోంది.అయితే దీనిపై లగడపాటి మాట్లాడుతూ కాకినాడలో శుభకార్యాలనికి వెళ్లాల్సి ఉండగా దారిలో మర్యాదపూర్వకంగా హర్షకుమార్ ను కలిశానని పేర్కొన్నారని సమాచారం.
ప్రజల కోసం భవిష్యత్ ను లెక్కచేయకుండా కాంగ్రెస్ ను వీడానన్న ఆయన రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు.కానీ ఉండవల్లి, హర్షకుమార్ కు మద్ధతు ఇస్తానని చెప్పారు.
అయితే కాంగ్రెస్ సీనియర్లు హర్షకుమార్, లగడపాటి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.కాగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుంచి గత కొంతకాలంగా దూరంగా ఉన్న లగడపాటి రాజగోపాల్ తాజా భేటీలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.