ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజకీయాలకి చాలా దూరంగా ఉంటున్నారు.ఒకప్పుడు తాను ఏమి చేసినా సంచలనమే.
కాంగ్రెస్ హయాం లో ఒక వెలుగు వెలిగిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం సైలెంట్ అయిపోయారు.ఎన్నికలు ఎప్పడు జరిగినా తన సర్వేలతో జోస్యం చెప్పే లగడపాటి ఫలితాలు ఎప్పుడు సత్పలితాలనే ఇస్తాయి.
కానీ ఈ ఫలితాలు వెనుక అసలు రహస్యం ఏమిటి అనేది విశ్లేషకుల వాదన
తాజాగా సాగడపాటి సర్వే పేరుతో 2019 ఎన్నికల అంచనాలు సోషల్ మీడియాలో వైరల్ లా మారాయి.టిడిపి, వైసిపి మరియు జనసేన పార్టీలలో ఏపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? ఏ పార్టీకి ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ సర్వే ప్రకారం తెలుగు దేశం పార్టీ 71 సీట్లు గెలుచుకుంటుందట.2019 లో తొలిసారి ఎన్నికల బరిలో నిలవబోయే పవన్ జనసేన పార్టీ అన్ని రాజకీయ పార్టీల విజయావకాశాలకు గండి కొడుతూ 65 స్థానాలు కైవసం చేసుకుంటుందని, వైసీపీ కి కేవలం 39 స్థానాలకే పరిమితం కాబోతున్నట్లు సర్వే చెప్తోంది.లగడపాటి సర్వే చెప్తోంది
శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అత్యధిక స్థానాలని కైవసం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.ప్రభావం కడప, కర్నూలు వరకే పరిమితం కానున్నట్లు ఈ సర్వే లెక్కలు చెబుతున్నాయి.
అయితే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్న ప్రజలు ఎప్పటినుండో పోరాడుతున్న నిబద్దత ఉన్న వైసీపి అధ్యక్షుడు కి పట్టం కడుతారని.ఈ సర్వే ప్రజలని తప్పుదోవ పట్టించడానికే వైసీపి నాయకులు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
లగడపాటి సర్వే ప్రకారం మరొక్క సారి టీడీపీ ,పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలని మోసం చేయడానికి సిద్దపడుతున్నారని అనుకుంటున్నారు ప్రజలు.