ఆడవారు ఈ పొడిని రోజుకో స్పూన్ చొప్పున తింటే అంతులేని ఆరోగ్య లాభాలు మీ సొంతం!

మహిళలు తమ జీవితంలో ప్రతి దశలోనూ మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు.

అయినప్పటికీ తమ కంటే తమ కుటుంబ సభ్యుల బాగోగుల‌పైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు.

తాము తిన్న తినకపోయినా భర్త, పిల్లలు, అత్తమామలకు అన్ని టైం టు టైం చేసి పెడుతూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

అయితే ఇక నుంచైనా మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.రోజులో మీకంటూ మీరు కొంత సమయాన్ని కేటాయించుకోవడం అలవాటు చేసుకోండి.

పోష‌కాహారాన్ని డైట్ లో చేర్చుకోండి.ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే పొడి ఆడవారి ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.

Advertisement

రోజుకో స్పూన్‌ చొప్పున ఈ పొడిని ఆడవారు నిత్యం తీసుకుంటే అంతులేని ఆరోగ్య లాభాలను పొందుతారు.ఇంతకీ ఆ పొడి ఏంటి.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు నల్ల నువ్వుల( Black Sesame Seeds )ను వేసుకొని దోరగా వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు మరియు ఎండు కొబ్బరి విడివిడిగా పొడి చేసి ఒక బౌల్ లోకి వేసుకోవాలి.

ఇప్పుడు నువ్వులు ఎండు కొబ్బరి పొడిలో ఒకటిన్నర కప్పు ఆర్గానిక్‌ బెల్లం పొడి వేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.ఫ్రిడ్జ్ లో ఈ పొడిని స్టోర్ చేసి రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్లు చొప్పున తీసుకుంటే ఆడవారిలో నెలసరి సమస్యలు దూరమవుతాయి.

ఎంతమంది చేరినా తెలంగాణ లో టీడీపీకి కష్టమేనా   ?  
బిస్లరీ సంస్థను అమ్ముకుందామనుకున్న ఫౌండర్.. ఆయన కూతురు రంగంలోకి దిగడంతో..?

టైం టు టైం పీరియడ్స్ వస్తాయి.

Advertisement

ఈ పొడిలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.నిత్యం ఈ పొడిని తీసుకుంటే ఆడవారు రక్తహీనత సమస్య( Anemia ) నుంచి బయటపడతారు.అలాగే ఇప్పుడు చెప్పుకున్న పొడిలో అధిక స్థాయిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు కాపర్ ఉంటాయి.

ఇవి బలమైన ఎముకలను నిర్వహించడానికి మరియు బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక సంబంధిత రుగ్మతలను నివారించడానికి దోహదం చేస్తాయి.రోగనిరోధక వ్యవస్థను చురుగ్గా మారుస్తాయి.అభిజ్ఞా పనితీరును మెరుగుప‌రుస్తాయి.

వయస్సు-సంబంధిత క్షీణత నుండి మెదడును రక్షిస్తాయి.న‌ల్ల నువ్వులు, కొబ్బ‌రి పొడి మ‌రియు బెల్లంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.

ఇవి చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించి.గుండె జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి.

అలాగే ఇటీవ‌ల రోజుల్లో ఎంతో మంది మ‌హిళ‌లు హార్మోన్ అసమతుల్యతతో బాధ‌ప‌డుతున్నారు.అయితే పైన చెప్పుకున్న పొడిని నిత్యం తీసుకోవడం వల్ల ఈస్ట్రోజెన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

మొత్తం హార్మోన్ల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.

తాజా వార్తలు