ప్రవాసులకు కువైట్ హెచ్చరిక...ఈ నిభందన అతిక్రమిస్తే వీసాలు రద్దేనట..!!!

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది వలస వాసులు వెళ్ళే దేశం ఏదైనా ఉందంటే అరబ్బు దేశాలేనని చటుక్కున చెప్పేయచ్చు.ముఖ్యంగా ఈ అరబ్బు దేశాలలో కువైట్ వెళ్లేందుకు ప్రవాస కార్మికులు ఎక్కువ మక్కువ చూపుతుంటారు.

 Kuwait Warns Expatriates Visas Will Be Canceled If This Rule Is Violated Kuwait-TeluguStop.com

అయితే ఎలాగైతే ప్రవాసులకు కువైట్ సాదర స్వాగతం పలుకుతుందో తాము విధించిన నియమ నిభందనలకు విరుద్దంగా నడుచుకుంటే మెడ పట్టి బయటకు పంపుతుంది కూడా.తమ రూల్స్ కి విరుద్దంగా నడుచుకుంటే యువ రాజును సైతం అక్కడి చట్టాలను శిక్షించి తీరుతాయి అలాంటిది అక్కడికి ఉపాది కోసం వెళ్ళిన వారు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా

కువైట్ ప్రభుత్వం తమ దేశంలో ఉన్న ప్రవాసులకు హెచ్చరికలు జారీ చేసింది.రెసిడెన్సీ వీసాల విషయంలో కొన్ని కటినమైన నిర్ణయాలు అక్కడి ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

కువైట్ దేశం లోపల కాకుండా వెలుపల సుమారు 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉన్న వారి రెసిడెన్సీ వీసాలను రద్దు చేసే ప్రణాళికలు సిద్దం చేసిందట.ఈ మేరకు

Telugu Article, Kuwait, Residency Visas, Visa-Telugu NRI

కువైట్ లోని మీడియా సంస్థలు తాజాగా వెల్లడించాయి.ఆర్టికల్ 18 ప్రకారం వీసా పొందిన వారు ఆ తరువాత సుమారు 6 నెలల పాటు కువైట్ లోపల కాకా కువైట్ వెలుపల ఉంటే అలంటి వ్యక్తుల యొక్క రెసిడెన్సీ వీసాలు తక్షణమే రద్దు అవుతాయి.డిపార్ట్మెంట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఇంటిరియర్’ మంత్రిత్వశాఖ ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేసిందని తెలుస్తోంది.

ఈ ప్రక్రియ నవంబర్ 1వ తేదీ నుంచీ మొదలు అవుతుందని తెలిపింది.ఇదిలాఉంటే తాజా నిభందన ప్రకారం మే 1 వ తేదీకి ముందు కువైట్ వీడిన వ్యక్తులు నవంబర్ 1 వ తేదీలోగా కువైట్ వచ్చేయాలని స్పష్టం చేసింది.

t

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube