బంధువును హతమార్చేందుకు కువైట్ ఎన్నారై పన్నాగం.. ఇద్దరు షూటర్లు అరెస్ట్..

కువైట్‌కు చెందిన ఓ ఎన్నారై తన బంధువును హత్య చేసేందుకు ఇద్దరు షార్ప్‌షూటర్లకు ఆఫర్లు ఇచ్చాడు.కాగా ఆ షార్ప్‌షూటర్లను పంజాబ్‌లోని సామ్రాల పోలీసులు తాజాగా అరెస్టు చేయడంతో అతడి బండారం బయటపడింది.

 Kuwait Nri News Nri Murder Plan Latest News Kuwait, Nri News, Nri Murder Plan,-TeluguStop.com

ఈ షార్ప్‌షూటర్లలో ఒకరు ఫిరోజ్‌పూర్‌లోని తల్వాండి భాయ్‌లోని పాట్లీ గ్రామానికి చెందిన గుర్చరణ్ సింగ్ నిక్కా అని, మరొకరు మోగాలోని లంధేకేకి చెందిన కుల్వంత్ సింగ్ కాంటా అని పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితే.

ఫిబ్రవరి 8న పోలీసులు స్పెషల్ చెకింగ్స్‌ ని నిర్వహించారు.ఈ తనిఖీల్లో పిస్టల్‌ ఉన్న గుర్చరణ్ సింగ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

తరువాత అతని వద్ద నుంచి మ్యాగజైన్‌తో కూడిన పిస్టల్‌ను సీజ్ చేసినట్లు సామ్రాల డీఎస్పీ వార్యం సింగ్ స్థానిక మీడియాకి తెలిపారు.మ్యాగజైన్‌లో .30 బుల్లెట్స్ ఉన్నట్లు వెల్లడించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 8న గుర్చరణ్ సింగ్‌ను పట్టుకున్నాక సామ్రాల పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది.

ఫిబ్రవరి 9న గురుచరణ్‌ని కోర్టులో హాజరుపరిచారు.అప్పుడు కోర్టు నాలుగు రోజుల పోలీసు రిమాండ్ విధించింది.

విచారణ సమయంలో గుర్చరణ్ బధాని కలాన్‌కు చెందిన ఏకమ్ సింగ్ పేరును బయటపెట్టాడు.ఏకమ్ సింగ్ కువైట్‌లో నివసిస్తున్న ఒక భారతీయుడు.

గుర్చరణ్ ఫోన్‌ను పరిశీలించగా అతను లాంధేకేకి చెందిన కుల్వంత్, బధ్ని కలాన్‌కు చెందిన నీలాతో పరిచయం పెంచుకున్నాడని పోలీసులకు తెలిసింది.వీరు ఇద్దరూ గుర్చరణ్‌కు పిస్టల్‌ను అందించారు.

Telugu Kuwait, Latest, Moga, Nri, Patli, Punjab, Samrala-Telugu NRI

కాగా పోలీసులు ఏకమ్, కుల్వంత్, నీలను హత్య కుట్ర కేసులో నిందితులుగా పేర్కొన్నారు.ఆపై కుల్వంత్‌ను కటాకటాల వెనక్కి నెట్టారు.అసలు సంగతి ఏంటంటే, కువైట్‌లో నివసించే ఏకమ్ వ్యక్తిగత పగతో తన మేనమామ కుమారుడిని మర్డర్ చేయించాలని ప్లాన్ చేశాడు.కొన్నేళ్ల క్రితం, దుండగులు మేనమామ కుమారుడిని చంపేందుకు కాల్పులు జరిపారు.

కాగా ఆ సమయంలో అతను తుపాకీ బుల్లెట్స్ తాకకుండా చాకచక్యంగా తప్పించుకున్నాడు.ఈ వ్యవహారమై మోగా జిల్లాలో పోలీసులు ఒక కేసు రిజిస్టర్ చేశారు.

షార్ప్‌షూటర్లను కువైట్ తీసుకెళ్లడంతో పాటు బస ఏర్పాటు చేస్తానని ఏకమ్ డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube