Squill Kurkure : ఆకలితో ఉన్న ఉడతకు కుర్‌కురే తినిపించాడు.. వీడియో వైరల్

జంతువులను మచ్చిక చేసుకుంటే అవి బాగా అలవాటు పడతాయి.మనం చెప్పినట్లు చేస్తాయి.

 Kurkure Fed A Hungry Squill Video Viral Squill, Viral Latest, News Viral, Socia-TeluguStop.com

అయితే మనకు ఏ మాత్రం పరిచయం లేని జంతువులు మన దగ్గరికి వస్తే మాత్రం ఆ అనుభూతి చాలా వైవిధ్యంగా ఉంటుంది.ఒక్కోసారి ఇలాంటి సందర్భాలలో వాటికి మనం ఏవైనా తినిపిస్తే అవి ఏ మాత్రం సంకోచించకుండా తింటాయి.

ముఖ్యంగా ఇలాంటివి కోతుల విషయంలో మనం చూస్తుంటాం.మన దగ్గర ఉన్న అరటి పండ్లు పెడితే చక్కగా తీసుకుని తినేస్తాయి.

అయితే ఉడతలు వంటివి మనుషుల దగ్గరికి రావడం చాలా అరుదుగా చూస్తుంటాం.అయితే ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చిన ఉడుతకు కుర్‌కురే చిప్స్ తినిపించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

దీనికి సంబంధించిన విషయాలిలా ఉన్నాయి.

సాధారణంగా ఉడతలు ఏవైనా గింజలు, పండ్లు తినిపిస్తే తింటాయి.

బాదం గింజలను కొరికి కొరికి తింటాయి.అయితే అంతకు మించి అవి ఎప్పుడూ తిననివి తినిపిస్తే అంతగా ఇష్టపడవు.

అయితే ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చిన ఉడుతకు తాను తింటున్న కుర్ కురే ప్యాకెట్ లోని చిప్స్ తినిపించాడు.అయితే అప్పటికే అది ఆకలిగా ఉందేమో, వెంటనే అతడు పెట్టిన కుర్ కురే చిప్స్‌ను వెంటనే తినేసింది.

ఈ వీడియోను గుల్జార్ సాహెబ్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

అతడు తన దగ్గరకు వచ్చిన ఉడుతకు చిప్స్ ప్యాకెట్ లో నుంచి ఒకటి తీసి పెట్టాడు.అది దానికి నచ్చి ఉంటుంది.ఇక ఈ దృశ్యం చూసిన మరికొన్ని ఉడుతలు అక్కడకు వచ్చి గుమిగూడాయి.తమకు కూడా ఆ చిప్స్ కావాలనే రీతిలో ప్రవర్తించాయి.ఇక ఆ వ్యక్తి కూడా తన చిప్స్ ప్యాకెట్ మొత్తం ఆ ఉడుతలకు తినిపించేశాడు.అవి కూడా తమకు అవి ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలుగా అన్నట్లు వెంటనే అవి తినేశాయి.

చివరికి ఉడుతలు కూడా చిప్స్ ప్యాకెట్లకు బాగా అలవాటు పడ్డాయని, ఒక్క సారి రుచి చూడగానే చిప్స్ రుచికి మైరిచి పోయాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube