తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఖరారు అయిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఈరోజు నుండి రేవంత్ రెడ్డి రూలింగ్ ప్రారంభం కానుంది.
అదంతా పక్కన పెడితే హైదరాబాద్ జనాలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినందుకు చాలా బాధపడుతున్నారు.ఎందుకంటే హైదరాబాద్ సిటీ ని ఒక రోల్ మోడల్ లాగ తీర్చి దిద్దాడు కేసీఆర్.
ఎన్నో కంపెనీలను తీసుకొచ్చాడు కూడా.ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు అయితే కేసీఆర్ ఓడినందుకు శోకసంద్రం లో మునిగిపోయారు అనే చెప్పాలి.
ఒక్కసారి ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ కంటే భయంకరమైన మెజారిటీ తో ప్రతీ స్థానం లోనూ గెలుపొందింది బీఆర్ఎస్ పార్టీ( BRS party )దాదాపుగా 17 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది.ఇది హైదరాబాద్ జనాలు బీఆర్ఎస్ పార్టీ మీద చూపించిన స్వచ్ఛమైన అభిమానం అనే చెప్పాలి.
ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో నెటిజెన్స్ గత కొద్దిరోజుల నుండి విన్నూతనమైన ట్రెండింగ్ ని చేస్తున్నారు.ముఖ్యమంత్రిగా ఎవరైనా ఉండండి కానీ, మా తెలంగాణ ఐటీ శాఖా మంత్రిగా మాత్రం కేటీఆర్ ని పెట్టుకోండి అని రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ని, కాంగ్రెస్ పార్టీ ని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు.చూసేందుకు ఇది చాలా సిల్లీ గా అనిపించినా, కేటీఆర్ ( KTR )పై జనాలు ఎంత ప్రేమ చూపిస్తున్నారో అర్థం అవుతుంది.ఈ ట్రెండింగ్ జరిగిన వెంటనే కేటీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్న విధంగా ఉన్న ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
ఆ ఫోటో ని చూసి ప్రతీ ఒక్కరు కాంగ్రెస్ పార్టీ తో కేటీఆర్ నిజంగానే కలిసిపోయాడా అంటూ ట్వీట్స్ వెయ్యడం ప్రారంభించారు.కానీ సోపీసీఎల్ మీడియా లో ట్రెండ్ అయిన ఆ ఫోటో లేటెస్ట్ మాత్రం కాదు.
మూడేళ్ళ క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి తో అసెంబ్లీ లో ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఫోటో ని తీసినట్టు తెలుస్తుంది.పదేళ్ల పాటు అధికారం లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, మొట్టమొదటిసారి ప్రతిపక్షం లో ఉండడం ఆ పార్టీ అభిమానులకు కాస్త ఇబ్బందికరమే అని చెప్పాలి.అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ అసెంబ్లీ లోకి అడుగు పెట్టే ఛాన్స్ లేదట.ఆయన ద్రుష్టి మొత్తం ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల మీదనే ఉందట,సొంత రాష్ట్ర రాజకీయాల్లోనే ఓడిపోయిన కేసీఆర్, ఈ కష్టమైన సమయం లో జాతీయ రాజకీయాల పై ద్రుష్టి సారించడం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.