హైదరాబాద్ లోని బంజారాహిల్స్ నందినగర్ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాలులో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో మంత్రి కేటీఆర్ ఓటు వేశారు.కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కావాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు.
మీ ఓటు.పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి
మీ ఓటు.తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలి
మీ ఓటు.తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగించాలి
మీ ఓటు.వ్యవసాయ విప్లవానికి వెన్నెముకగా నిలవాలి మీ ఓటు.మహిళల ముఖంలో చెరగని చిరునవ్వులు నింపాలి మీ ఓటు.యువత ఆకాంక్షలను నెరవేర్చే అవకాశాల అక్షయపాత్ర కావాలి మీ ఓటు.సబ్బండ వర్ణాల్లో.సంతోషాన్ని పదిల పరచాలి మీ ఓటు.తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా, సగర్వంగా ఎగరేయాలి మీ ఓటు.తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలి మీ చేతిలోని వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృథాకానివ్వకండి అందుకే.ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కండి.
అందరూ రండి.! ప్రతి ఒక్కరూ ‘ముచ్చటగా…’ ఓటు హక్కును వినియోగించుకొండి.!!
జై తెలంగాణ
జై భారత్