ఆ విషయాలను బలంగా జనంలోకి తీసుకు వెళ్లాలని నాయకులకు కేటీ‌ఆర్ సూచన

తెలంగాణ మంత్రి కేటీ‌ఆర్ శాసన మండలి ఎన్నికల పై, వరంగల్ మున్సిపల్ ఎన్నికలపై, అక్కడి నేతలతో సమావేశం అయ్యాడు.గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరాడు.

ఈ సందర్భంగా వరంగల్ మున్సిపల్, పట్టభద్ర ఎన్నికలు, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్ర ఎన్నికపై ఉమ్మడి వరంగల్ నేతలతో మాట్లాడాడు.ఈ నేపథ్యంలో కే‌టి‌ఆర్ గ్రేటర్, దుబ్బాక ఫలితాలను గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆత్మ విశ్వాసం తో గెలుపే లక్ష్యం గా పనిచెయ్యాలని కోరాడు.

టి‌ఆర్‌ఎస్ పార్టీ అత్యంత బలమైన పార్టీ అని ప్రజల్లో ఆ విషయాన్ని బలంగా చాటలని అన్నాడు. 60 లక్షల వరకు సభ్యత్వాలు ఉన్నాయని గుర్తు చేశాడు.

కార్యకర్తలు, ఎం‌ఎల్‌ఏ లు మంత్రులు ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పనిచెయ్యాలని తెలిపాడు.ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజెయ్యాలని కోరాడు.

Advertisement

మార్చి మొదటి వారంలో ఎం‌ఎల్‌సి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కావున ప్రతి బూత్ కు 15 ఇంచార్జ్ లను నియమిస్తున్నాం అన్నాడు.అలాగే ప్రతి 50 మంది ఓటర్లకు ఓ కార్యకర్తను నియమించాలని సూచించాడు.

ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పళ్ల రాజేశ్వర్ రెడ్డి పలువురు జిల్లా నాయకులు ఎం‌ఎల్‌ఏ లు ఎం‌పి‌టి‌సి లు జెడ్‌పి‌టి‌సి లు పాల్గొన్నారు.నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ఈ రోజు నల్గొండ జిల్లా నేతలతో కే‌టి‌ఆర్ ముచ్చటించనున్నాడు .

Advertisement

తాజా వార్తలు