ఏ రాజకీయ పార్టీకైనా యువ కార్యకర్తలు అనే వారు చాలా ముఖ్యం.పార్టీ మనుగడలో యువత కీలకపాత్ర పోషిస్తారనేది మనం కాదనలేని వాస్తవం.
అయితే ఒకప్పుడు రాజకీయ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణల ఆధారంగా రాజకీయాలు నడిచేవి.కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
సోషల్ మీడియా వేదికగా అతి పెద్ద రాజకీయం నడుస్తోంది.ప్రస్తుతం సోషల్ మీడియాను చాలా వరకు వినియోగిస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా ఎవరు ఆధిపత్యం వహిస్తారో వారి పార్టీ బలంగా ఉన్నట్లు యువత కాని, మిగతా సామాన్య ప్రజలు నమ్మే అవకాశం ఉంది.ఇందులో భాగంగానే అన్ని పార్టీలు తమ విద్యార్ధి విభాగం నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటారు.
ఇందులో భాగంగానే కేటీఆర్ టీఆర్ఎస్వీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్థానికంగా ప్రజలను జాగృతం చేయడం విషయంలో పలు సూచనలు చేశారు.
అంతే కాక తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.అయితే త్వరలో తెలంగాణ యువతకు తీపి కబురు చెబుతామని, నిరుద్యోగ యువత నైరాశ్య పడాల్సిన అవసరం లేదని వారిని ఉత్తేజపరిచారు.
మీరు ధైర్యంగా ప్రజలకు అవగాహన కల్పించాలని టీఆర్ఎస్వీ నేతలకు కేటీఆర్ సూచించారు.ఏది ఏమైనా రానున్న ఎన్నికలో గెలుపు వ్యూహంలో భాగంగానే కేటీఆర్ టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం వారితో సమావేశం ఏర్పాటు చేశారని, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.