మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై( KTR ) కాంగ్రెస్ నేత ఎంపీ అనిల్ కుమార్( MP Anil Kumar ) తీవ్రంగా మండిపడ్డారు.కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే కేటీఆర్ నోరు అదుపులోకి పెట్టుకోకపోతే హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు.కావాలనే సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.