తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )కి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సవాల్ విసిరారు.తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
అటు సీఎం పదవి, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి రావాలన్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం( Malkajgiri Lok Sabha Constituency )లో ఇద్దరు తేల్చుకుందామని చెప్పారు.ఎవరు గెలుస్తారో చూద్దామని పేర్కొన్నారు.ఇందుకోసం రేవంత్ రెడ్డి రావాలని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.