క్రిష్ 4 ఊహించని స్థాయిలో ఉంటుందంటా... ఈ సారి టైం ట్రావెల్ తో

బాలీవుడ్ గీక్ హృతిక్ రోషన్ కెరియర్ కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన చిత్రాలు అంటే క్రిష్ సిరీస్.ఈ సిరీస్ లో భాగంగా ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.

ఇండియన్ సూపర్ మెన్ సిరీస్ గా దీనికి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్ ఈ సిరీస్ కి కథ అందించడంతో పాటు దర్శకత్వం చేస్తున్నాడు.

ఇంకా ఈ సిరీస్ లో భాగంగా నాలుగో భాగం తెరకెక్కించడానికి రాకేశ్ రోషన్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే దానికి సంబంధించి అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు.

ఈ సారి ఇంటర్నేషనల్ లెవల్ లో క్రిష్4 ఉండబోతుందని చెప్పారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సిరీస్ కి సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ బిటౌన్ లో వినిపిస్తుంది.

Advertisement

క్రిష్4 కోసం రాకేశ్ రోషన్ టైం ట్రావెల్ కథని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.క్రిష్ వర్తమానం, భవిష్యత్తులోకి వెళ్ళగలిగే ఒక మిషన్ కనిపెడతాడు.అయితే ఆ మిషన్ ని విలన్ గ్యాంగ్ సొంతం చేసుకొని దాని ద్వారా విద్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తారు.

ఈ ప్రయత్నాన్ని క్రిష్ ఏ విధంగా కంట్రోల్ చేశాడు అనే ఎలిమెంట్ తో క్రిష్ 4 కథాంశం ఉండబోతుందని తెలుస్తుంది.ఇక ఈ మూవీ కోసం హాలీవుడ్ నటులని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

అలాగే భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ లో మూవీని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్.ఈ ఏడాదిలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలని రాకేశ్ రోషన్ భావిస్తున్నారు.

మరి ఈ ఇండియన్ సూపర్ మెన్ సిరీస్ లో భాగంగా తెరకెక్కబోయే ఈ మూవీలో ఎంత మంది నటులు భాగస్వామ్యం అవుతారనేది చూడాలి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు