ఉప్పెన సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయిన విషయం తెలిసిందే.ఈ అమ్మడు పరిచయమైన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాలా ఆకట్టుకుంది.17 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా పరిచయ మయ్యి బిజీగా మారిపోయింది.ఈ ఒక్క సినిమా హిట్ తోనే చాలా అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈమె వరుస హిట్స్ అందుకుంటూ కుర్ర హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.ఈ ఏడాది లోనే రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాటు, ఇటీవలే నాగ చైతన్య, నాగార్జున కలయికలో వచ్చిన బంగార్రాజు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.ఇక ఈమె ప్రెసెంట్ కుర్ర హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.

ప్రెసెంట్ కృతి శెట్టి నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమాతో పాటు రామ్ పోతినేని ది వారియర్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఇటీవలే పవన్ చేస్తున్న రీమేక్ సినిమాలో సాయి తేజ్ సరసన అవకాశం కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి.ఇది ఇలా ఉండగా ఇప్పుడు తమిళ్ లో కూడా స్టార్ హీరో సినిమాలో అవకాశం అందుకుని అందరికి షాక్ ఇచ్చింది.

తమిళ్ డైరెక్టర్ బాల, సూర్య కలయికలో ఒక సినిమా రాబోతుంది.వీరి కలయికలో ఇంతకు ముందు పితామగన్ అనే సినిమా వచ్చింది.ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమా తెలుగులో కూడా శివ పుత్రుడు పేరుతొ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.ఇక దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో మరొక సినిమా రాబోతుంది.
ఈ కాంబో ను అధికారికంగా ప్రకటించారు.ఈ రోజు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

అలాగే ఈ సినిమాలో సూర్య కు జోడీగా నటించే హీరోయిన్ ని కూడా ప్రకటించారు.ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు.తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్న కృతి శెట్టి ఇప్పుడు తమిళంలో కూడా వరుస సినిమా అవకాశాలు అందుకోవడానికి రెడీ అయ్యింది.ఈ సినిమా సూర్య కెరీర్ లో 41వ సినిమాగా తెరకెక్కుతుంది.
ఇటీవలే ఈటి సినిమాతో వచ్చి అంచనాలను అందుకోలేక పోయిన సూర్య ఇప్పుడు ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాల్సిందే.







