ఆ స్టార్ డైరెక్టర్ వల్ల ఇబ్బంది పడ్డాను.. కృతిశెట్టి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన కృతిశెట్టి ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకోగా కృతిశెట్టి నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి.

ది వారియర్ సినిమాతో కృతిశెట్టి ఖాతాలో మరో సక్సెస్ చేరడం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కృతిశెట్టి ది వారియర్ ప్రమోషన్లలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నా మాతృభాష తుళు అని అయితే తాను తెలుగు భాషను కూడా బాగానే మాట్లాడగలనని ఆమె చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకు టాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో ఎక్కువగా నటించడంతో నేను తెలుగు భాషను సులువుగా మాట్లాడగలనని ఆమె చెప్పుకొచ్చారు.లింగుస్వామి గారు తెలుగులో మాట్లాడతారని అయితే ఆయన తెలుగులో తమిళ యాస ఉంటుందని కృతిశెట్టి చెప్పుకొచ్చారు.

నాకు తమిళం రాదు కాబట్టి ఆయన మాట్లాడే తెలుగు అర్థమయ్యేది కాదని కృతిశెట్టి కామెంట్లు చేశారు.

Advertisement

లింగుస్వామి మాటలు అర్థం కాక వారం రోజుల పాటు నేను ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. రామ్ కు తమిళం బాగా వచ్చు అని ది వారియర్ షూటింగ్ సమయంలో నేను రామ్ యొక్క సహాయం తీసుకున్నానని కృతిశెట్టి కామెంట్లు చేశారు.లింగుస్వామి ఏం చెబుతున్నారో రామ్ చెప్పడం వల్ల ఆయన తెలుగు యాసకు నేను అలవాటు పడ్డానని కృతిశెట్టి కామెంట్లు చేశారు.

కృతిశెట్టి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ మధ్య కాలంలో రిలీజైన సినిమాలేవీ సక్సెస్ సాధించకపోవడంతో ది వారియర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో థియేటర్లు దొరుకుతున్నాయి.

పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందనడంలో సందేహం అవసరం లేదు.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు