గ్రామ గ్రామానా క్రీడా ప్రాంగణాలు - మంత్రి ఆర్. కె. రోజా

ఏపీ సచివాలయంలోని మంత్రి చాంబర్ లో టూరిజం, సాంస్కృతిక మరియు క్రీడా శాఖా అధికారులతో రాష్ర్ట పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా సమీక్షా సమావేశం నిర్వహించారు.టూరిజం సాంస్కృతిక మరియు క్రీడా శాఖ స్పేషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఓడిలతో శాఖల వారీగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

 Minister Rk Roja Review Meeting On Ap Tourism Department Details, Minister Rk Ro-TeluguStop.com

పస్తుతం పురోగతిలో వున్న పనుల ప్రగతిని మంత్రి సమీక్షించారు.పర్యాటక శాఖలో టూరిజం ప్రాజెక్టులలో భూసేకరణ పనులు, ఓ అండ్ ఎం టెండర్స్, పిపిపి ప్రాజెక్టుల పురోగతిని, ప్రసాద్ స్కీమ్ ద్వారా చేపట్టిన పనులను అధికారులు మంత్రికి వివరించారు.

రాష్ట్రంలో పర్యాటకశాఖ పరిధిలో వున్న హరితా హోటల్స్ లీజు, వాటి నిర్వహణ, పని తీరుపై అదికారులు మంత్రికి తెలియజేశారు.రూయ హస్పిటల్ వద్ద నిర్మాణంలో బిల్డింగ్ పనులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, వాటిని పర్యాటక పరంగా మరింతగా అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యం అని మంత్రి తెలిపారు.పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్దానంలో వుండాలని, ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సంబంధించి పబ్లిసిటీ చేయాలని, పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాకట ప్రదేశాలను తీర్చిదిద్దాలని మంత్రి ఆధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో వున్న హిల్ ప్లేస్, బస్సు రవాణా సౌకర్యం లేని పర్యాటక ప్రాంతాలకు అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయాలని, రోడ్లని ఆధునీకరించడానికి రోడ్లు మరియు భవనాల శాఖా అధికారులతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మైపాడు బీచ్, కాళహస్తీ పర్యాటక ప్రదేశాలపై ఆదికారులతో చర్చించారు.

సాంస్కృతిక శాఖకు సంబంధించి అరకు ట్రైబల్ మ్యూజియం అభివృద్ది పనులపై చర్చించారు.క్రీడా శాఖా అదికారులతో రాష్ట్రంలోని పాఠశాలల్లోని విద్యార్ధులకు జగనన్న స్పోర్ట్ కిట్స్ ని అందించే అంశాలపై చర్చించారు.

PYKKA ఫండ్స్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు, స్పోర్ట్ ప్రైవేట్ అసోసియేషన్స్ గుర్తింపు, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, స్పోర్ట్స్ స్టేడియాల నిర్మాణాలపై క్రీడాశాఖ అదికారులతో చర్చించారు.చర్చించిన అంశాలపై చర్యలు చేపట్టాలని, వాటిపై నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు.

సమీక్ష సమావేశం లో YATC శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, విసి ఎండీ కన్నబాబు, శాప్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube