ఉప్పెన సినిమాతో తన పేరుని బేబమ్మగా మార్చేసుకున్న కృతి శెట్టి వరుస క్రేజీ సినిమాలతో సత్తా చాటుతుంది.ఈ ఇయర్ ఆల్రెడీ బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజక వర్గం సినిమాలతో ఈ ఇయర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి శెట్టి మరో రెండు రోజుల్లో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో రాబోతుంది.
ఈ సినిమాలో ఆమె ఒక డాక్టర్ గా కనిపిస్తుంది.డైరక్టర్ ప్రేమలో పడిన డాక్టర్ గా కృతి శెట్టి నటిస్తుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో కృతి శెట్టి యాక్టివ్ గా పాల్గొంటుంది.
ఇక మరోపక్క తన ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తుంది కృతి శెట్టి.
లేటెస్ట్ గా అమ్మడు శారీ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది.బ్లూ బ్లాక్ కలర్ మెరుపులు మెరిసే శారీలో తన ఓర కళ్లతో ఆడియన్స్ కి మత్తెక్కించేస్తుంది అమ్మడు.
శారీ లుక్ లో కూడా కృతి శెట్టి అదుర్స్ అనిపించేలా కనిపిస్తుంది. తన చూపులకి క్లీన్ బౌల్డ్ అవ్వని మగ వాడంటూ ఉండడని చెప్పొచ్చు.
ఉప్పెన, శ్యాం సింగ రాయ్, బంగార్రాజు సినిమాలతో హిట్ అందుకున్న కృతి శెట్టి వారియర్, మాచర్ల సినిమాలు మాత్రం నిరాశపరచాయి.మరి రాబోతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా అయినా కృతికి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.







