ఉప్పెన సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయిన విషయం తెలిసిందే.ఈ అమ్మడు పరిచయమైన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాలా ఆకట్టుకుంది.17 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా పరిచయ మయ్యి బిజీగా మారిపోయింది.ఈ ఒక్క సినిమా హిట్ తోనే చాలా అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
బేబమ్మ గా తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గర అయినా ఈ బ్యూటీ ఉప్పెన ఇచ్చిన సక్సెస్ తో వరుస అవకాశాలు అందుకుంటుంది.శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నానికి జోడీగా నటించి మెప్పించింది.
ఇక ఈమె ఇటీవలే బంగార్రాజు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.అలాగే రామ్ పోతినేని నటిస్తున్న ది వారియర్ సినిమాలో కూడా నటిస్తుంది.
ఇంకా నితిన్ తో కూడా మాచర్ల నియోజకవర్గం సినిమా చేస్తుంది.ఈ సినిమాల్లో రెండు సినిమాలు రిలీజ్ అవ్వకుండానే ఇప్పుడు మరొక బంపర్ ఆఫర్ అందుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఈసారి ఏకంగా పాన్ ఇండియా స్టార్ తో నటించే అవకాశం అందుకున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.మారుతి, ప్రభాస్ కాంబోలో వస్తున్నా రాజా డీలక్స్ సినిమాలో ప్రభాస్ ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్నట్టు టాక్ బయటకు వచ్చింది.

అయితే ఈ ముగ్గురు భామల్లో కృతి శెట్టి ఒకరు అని తెలుస్తుంది.తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ కు జోడీగా కృతి శెట్టి కి నటించే అవకాశం వచ్చిందట.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఇదే విషయం నిజం అయితే కనుక ఈమె దశ తిరిగినట్టే.ఈమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటిస్తే ఈమెకు మరింత మంది స్టార్ హీరోలు అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది.
చూడాలి మరి కృతి శెట్టి లక్ ఎలా ఉండబోతుందో.







