అప్పుడు సినిమా బడ్జెట్‌ రూ.7 లక్షలు... ఇప్పుడు కలెక్షన్స్ టార్గెట్‌ రూ.5 కోట్లు

సూపర్ స్టార్‌ కృష్ణ( Super star Krishna ) జయంతి సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’( mosagallaki mosagaadu )సినిమా ను మే 31వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.రీ రిలీజ్ అయిన సినిమాలు ఇప్పటి వరకు సాధించిన వసూళ్ల మార్క్ ను ఈ సినిమా క్రాస్ చేయబోతున్నట్లుగా అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.

 Krisha Movie Mosagallaki Mosagaadu Re Release May 31st Details, Krisha,mahesh Ba-TeluguStop.com

మోసగాళ్లకు మోసగాడు సినిమా అప్పట్లో పాన్ ఇండియా మూవీ గా నిలిచింది.అన్ని భాషల్లో కూడా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.

సొంత బ్యానర్‌ లో తమ్ముడు ఆదిశేషగిరి రావు తో ఈ సినిమాను కృష్ణ నిర్మించాడు.

Telugu Krisha Latest, Krishna, Mahesh Babu-Movie

అప్పట్లో కృష్ణ యొక్క సినిమాల బడ్జెట్‌ నాలుగు నుండి అయిదు లక్షలు ఉండేది.కానీ మోసగాళ్లకు మోసగాడు సినిమా ను రూ.7 లక్షలు ఖర్చు చేయడం జరిగింది.రెండు లక్షలు అదనంగా ఖర్చు చేయడంతో చాలా మంది చాలా రకాలుగా భయపెట్టారని నిర్మాత ఆదిశేషగిరి రావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.అప్పట్లో ఏడు లక్షల రూపాయల బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కోసం సిద్ధం అయ్యింది.

అందుకు గాను 4కే టెక్నాలజీ( 4K Technology ) లోకి సినిమాను మార్చడం జరిగింది.

Telugu Krisha Latest, Krishna, Mahesh Babu-Movie

సినిమా ను 4 కే లోకి తీసుకు రావడానికి ఏకంగా 25 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందని ఆయన పేర్కొన్నాడు.ఇక ఈ సినిమా రీ రిలీజ్ లో కచ్చితంగా అయిదు కోట్ల రూపాయలను వసూళ్లు చేయడం ఖాయం అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.తాజాగా మహేష్ బాబు ఈ సినిమా యొక్క కొత్త ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

విజయ నిర్మల గారికి కూడా ఇది గొప్ప గౌరవం అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో అని కాకుండా ప్రపంచం మొత్తం కూడా సినిమాను భారీ ఎత్తున రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.50 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా అయిదు కోట్ల టార్గెట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మరి ఆ స్థాయి లో ఈ సినిమా రాబడుతుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube