తెలుగు చిత్ర పరిశ్రమలో కేపీ చౌదరి డ్రగ్స్ ప్రకంపనలు

టాలీవుడ్ లో నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంది.

సినీ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కేపీ చౌదరిని కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణ రానుంది.అయితే కేపీ చౌదరి లిస్టులో సినీ ప్రముఖులతో పాటు పలువురు వ్యాపార వేత్తలు ఉన్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కేపీ కాంటాక్ట్స్ జాబితాలో వందల పేర్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఈ కేసులో ఏ1 గా ఉన్న రాకేశ్ రోషన్ కూ తారలతో సంబంధాలు ఉండవచ్చని భావిస్తున్నారు.పలు పార్టీల్లో రోషన్, కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరా చేశారని తెలుస్తోంది.

మరోవైపు నైజీరియన్ గాబ్రియేల్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.గాబ్రియేల్ ద్వారానే హైదరాబాద్ కు అధిక శాతం డ్రగ్స్ సరఫరా అవుతుందని పోలీసులు తెలిపారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు