చిత్రం: కోతలరాయుడు
నటీనటులు:
శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్సాంకేతిక నిపుణులు:కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ రాజుసంగీతం: సునీల్ కశ్యప్సినిమాటోగ్రఫీ: బుజ్జిఎడిటర్: ఉద్ధవ్మాటలు: విక్రమ్ రాజ్, స్వామి మండేలాఆర్ట్ డైరెక్టర్: ఠాగూర్పాటలు: కంది కొండఫైట్స్: రియల్ సతీష్పబ్లిసిటి డిజైనర్: ధని ఏలేప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సురేష్ వర్మకో.డైరెక్టర్: హారనాధ్ రెడ్డినిర్మాతలు: ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్
శ్రీకాంత్ (అజయ్) సరదాగా గడిపే ఒక వ్యక్తి.డబ్బును బాగా ఖర్చు చేస్తూ విలాసవంతంగా గడుపుతూ ఉంటాడు.ఒక ట్రావెల్ కంపెనీలో మేనేజర్ గా ఉన్న అజయ్ డబ్బు ఉన్న ధనలక్ష్మి ని (నటాషా దోషి) వివాహం చేసుకోవాలని అనుకుంటాడు.
ధనలక్షి కుటుంబానికి అజయ్ తో నిచ్చితార్ధం క్యాన్సిల్ అవుతుంది.ఆ తరువాత అజయ్ సంధ్య (డింపుల్) ని ప్రేమిస్తాడు, చివరికి ఏం జరిగింది ? అజయ్ , ధనలక్ష్మి నిచ్చితార్ధం ఎందుకు క్యాన్సిల్ అయ్యింది ? తెలియాలంటే కోతల రాయుడు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
చాలా రోజుల తరువాత హీరో శ్రీకాంత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో నటించాడు.కోతల రాయుడు సినిమాను కుటుంభం అంతా కలిసి చూడవచ్చు.హీరోయిన్స్ నటశా, డింపుల్ బాగా నటించారు.కెమెరామెన్ బుజ్జి వర్క్ బాగుంది.30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి, హేమ ఎపిసోడ్ ఫన్నీగా బాగుంది.పోసాని, మురళి శర్మ రోల్స్ సినిమాకు మరింత హెల్ప్ అయ్యాయి.
మూవీ ఎక్కడా బోరింగ్ లేకుండా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.
సాంగ్స్ సిక్కింలో రిచ్ గా చిత్రీకరించారు.సునీల్ కశ్యప్ సంగీతం బాగుంది.
డైరెక్టర్ సుధీర్ రాజు ఎంచుకున్న కథ కథనాలు బాగున్నాయి.గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాను బాగా నడిపించాడు.శ్రీకాంత్ ను కొత్తగా చూపించడంలో దర్శకుడు సుధర్ బాగా సక్సెస్ అయ్యాడు.శ్రీకాంత్ ఈ మధ్య నటించిన కొన్ని చిత్రాలతో పోలిస్తే కోతల రాయుడు బెస్ట్ ఫిలిం గా చెప్పుకోవచ్చు.
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని ఈ సినిమాకు బాగా కుదిరాయి.ఫ్యామిలీలో ఉన్న అందరూ కలిసి ఈ సినిమాను హ్యాపీగా చూడొచ్చు.
చివరిగా: కోతలరాయుడు విజయం సాధించాడు.